Eknath Shinde: టీచర్లకు ఇక నుంచి ఆ పనులు ఉండవు.. తీపి కబురు చెప్పిన సీఎం

‘‘టీచర్లకు నాన్-టీచింగ్ (బోధనేతర) పనులు అప్పగిస్తున్నట్లు నాకు అనేకమైన ఫిర్యాదులు, అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఒక్క జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో తప్ప టీచర్లకు ఇక నుంచి బోధనేతర పనులు అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నాం. సంబంధిత విభాగానికి ఈ విషయమై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం’’ అని అన్నారు.

Eknath Shinde: టీచర్లకు ఇక నుంచి ఆ పనులు ఉండవు.. తీపి కబురు చెప్పిన సీఎం

No non teaching duties for teachers says Maharashtra CM Shinde

Eknath Shinde: ప్రభుత్వ టీచర్లు టీచింగ్ కాకుండా కొన్ని ప్రభుత్వ పనులు చేస్తుంటారు. పోలీయో, ఎన్నికలు.. ఇతర పనుల్లో తరుచూ వారు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి పనుల నుంచి టీచర్లకు విముక్తి కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే మంగళవారం ప్రకటించారు. బోధనేతర విధులను టీచర్లకు కేటాయించబోమని, వారిని విద్యార్థులకు చదువు చెప్పడానికి మాత్రమే వినియోగించుకుంటామని వెల్లడించారు. అయితే జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో ఇందుకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5 (సోమవారం) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంత మంది టీచర్లతో సీఎం షిండే మాట్లాడారు. ఈ సందర్భంగా టీచర్లను నాన్ టీచింగ్ పనుల నుంచి విముక్తి చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘టీచర్లకు నాన్-టీచింగ్ (బోధనేతర) పనులు అప్పగిస్తున్నట్లు నాకు అనేకమైన ఫిర్యాదులు, అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఒక్క జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో తప్ప టీచర్లకు ఇక నుంచి బోధనేతర పనులు అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నాం. సంబంధిత విభాగానికి ఈ విషయమై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం’’ అని అన్నారు.

Bengaluru Flooding: బెంగళూరు వరదలకు కాంగ్రెసే కారణమట.. కర్ణాటక సీఎం బొమ్మై విమర్శలు