అఫీషియల్ పేజీలు సేఫ్… FB పేజీల డిలీట్ పై కాంగ్రెస్ రీయాక్షన్

కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 ఫేస్ బుక్ పేజీలను, అకౌంట్లను డిలీట్ చేసినట్లు ఫేక్ బుక్ సంస్థ సోమవారం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2019 / 01:54 PM IST
అఫీషియల్ పేజీలు సేఫ్… FB పేజీల డిలీట్ పై కాంగ్రెస్ రీయాక్షన్

కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 ఫేస్ బుక్ పేజీలను, అకౌంట్లను డిలీట్ చేసినట్లు ఫేక్ బుక్ సంస్థ సోమవారం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 ఫేస్ బుక్ పేజీలను, అకౌంట్లను డిలీట్ చేసినట్లు ఫేక్ బుక్ సంస్థ సోమవారం చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన ఎలాంటి అధికారిక పేజీలు డిలీట్ అవ్వలేదని ట్వీట్ చేసింది.

పార్టీలో గుర్తింపు పొందిన వాలంటీర్ల ద్వారా రన్ చేస్తున్న ఫేస్ బుక్ పేజీలు కూడా ఎలాంటి ప్రభావానికి గురి కాలేదన్నారు. ఫేస్ బుక్ సంస్థ.. తొలగించామని చెబుతున్న పేజీలు, అకౌంట్లకు సంబంధించిన లిస్ట్ ను తమకు సమర్పించాలని కాంగ్రెస్ తెలిపింది. ఫేస్ బుక్ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు కాంగ్రెస్ ట్వీట్ లో తెలిపింది.

అవాస్తవమైన ప్రవర్తనతో అనవసరపు చెత్త విషయాలను ఫేక్ ఐడీల ద్వారా ఫేస్ బుక్ లోకి పంపడం వల్ల కాంగ్రెస్ ఐటీ విభాగంతో అసోసియేట్ అయిన వ్యక్తులకు సంబంధించిన 687 పేజీలను, అకౌంట్లను డిలీట్ చేసినట్లు సోమవారం (ఏప్రిల్ 1, 2019) ఉదయం ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నథనైల్ గ్లీచర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read Also : 687 కాంగ్రెస్ ఫేస్ బుక్ పేజీలు డిలీట్