Serving In Flight Meals : విమానాల్లో రెండు గంటలు కన్నా..ఎక్కువ ప్రయాణించే వారికే ఫుడ్

విమాన ప్రయాణ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భోజన సేవలను నిలిపివేయాలని పౌర విమానయాన శాఖ 2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం నిర్ణయం తీసుకుంది.

Serving In Flight Meals : విమానాల్లో రెండు గంటలు కన్నా..ఎక్కువ ప్రయాణించే వారికే ఫుడ్

No On Board Meals

No On-Board Meals : కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరీతిలో వ్యాపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. వైరస్ బారిన పడి..ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. దీంతో ఆయా దేశాలు కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రధానంగా..కేసులు నమోదవుతున్న దేశాల నుంచి ఇతర దేశాలకు వచ్చే వారి పట్ల పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. విమాన ప్రయాణ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భోజన సేవలను నిలిపివేయాలని పౌర విమానయాన శాఖ 2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం నిర్ణయం తీసుకుంది. అయితే..అందరికీ కాకుండా..కొంతమంది వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. రెండు గంటల లోపు ప్రయాణీకులకు, ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఇది వర్తిస్తుందని వెల్లడించింది. గురువారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని, ప్రయాణీకులు సహకరించాలని సూచించింది. ప్రతొక్కరికీ భోజనం, పానీయాలు సర్వ్ చేే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా చేతులకు గ్లవ్స్ తొడగాలని వెల్లడించింది. గత సంవత్సరం కరోనా కారణంగా మార్చి 25వ తేదీ నుంచి విమానాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అనంతరం పునరుద్ధరించినా…భోజన సేవలను అనుమతించలేదు. ఆగస్టు 31 తర్వాత ఈ సర్వీసును తిరిగి ప్రారంభించింది. కానీ..మరలా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. బ్రెజిల్‌ దాటి అత్యధిక కేసులు నమోదౌతున్న జాబితాలో అమెరికా తర్వాతే భారతదేశం నిలుస్తోంది.

Read More : Gun Misfire Case : గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్, భార్యను చంపేసిన హోం గార్డ్