No Penalty Driving Licences : వాహనదారులకు గుడ్‌న్యూస్.. అప్పటివరకూ డ్రైవింగ్‌పై పెనాల్టీ పడదు..

వాహనదారులకు గుడ్‌న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్ (DL) , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), ఫిట్ నెస్ వంటి అన్ని పత్రాల వ్యాలిడిటీని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభ సమయంలో ఫిబ్రవరి 20 తర్వాత వ్యాలిడిటీ గడువు ముగిసిన అన్ని వాహన పత్రాలపై వ్యాలిడిటీని పొడిగించింది.

No Penalty Driving Licences : వాహనదారులకు గుడ్‌న్యూస్.. అప్పటివరకూ డ్రైవింగ్‌పై పెనాల్టీ పడదు..

No Penalty For Driving With Expired Licences, Other Documents Until Sept 30

No Penalty Driving Expired Licences : వాహనదారులకు గుడ్‌న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్ (DL) , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), ఫిట్ నెస్ వంటి అన్ని పత్రాల వ్యాలిడిటీని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభ సమయంలో ఫిబ్రవరి 20 తర్వాత వ్యాలిడిటీ గడువు ముగిసిన అన్ని వాహన పత్రాలపై వ్యాలిడిటీని పొడిగించింది. ఈ మేరకు రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

గత ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వెహికల్ కు సంబంధించి ఫిట్‌నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు వ్యాలిడిటీని పెంచింది. పౌరులు, రవాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అప్పటివరకూ వాహనదారులు ఈ డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయని, ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మోటారు వాహనాల చట్టం, 1988, సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు, 1989 ప్రకారం.. ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ లేదా ఇతర పత్రాల చెల్లుబాటును మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30 వరకు పొడిగించిందని అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా పెనాల్టీ రూ .5000 జరిమానా ఉంది. అదే పర్మిట్ లేకుండా రూ .10వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.