Rules for Police: డ్యూటీలో ఉన్న పోలీసులకు నో ఫోన్.. నో సోషల్ మీడియా

మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వంటివి చేయకూడదని బీహార్ పోలీసులకు ఆర్డర్లు అందాయి. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నా వీఐపీ లేదా వీవీఐపీ భద్రత బ్యూటీలో ఉన్నా తప్పక పాటించాలని ఆదేశించారు.

Rules for Police: డ్యూటీలో ఉన్న పోలీసులకు నో ఫోన్.. నో సోషల్ మీడియా

Rule For Police

Rules for Police: మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వంటివి చేయకూడదని బీహార్ పోలీసులకు ఆర్డర్లు అందాయి. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నా వీఐపీ లేదా వీవీఐపీ భద్రత బ్యూటీలో ఉన్నా తప్పక పాటించాలని ఆదేశించారు.

బీహార్ డీజీపీ ఎస్కే సింఘాల్ మంగళవారం ఈ ఆర్డర్ పాస్ చేశారు. వీటిని పట్టించుకోకుండా ప్రవర్తిస్తే డిసిప్లినరీ ఛార్జెస్ అనుభవిస్తారని ఆర్డర్. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్లు, మొబైల్ డివైజ్ లలో బిజీగా గడుపుతున్నారని చాలా కంప్లైంట్లు రావడంతో డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సిటీలోని చాలా ప్రాంతాల్లో పోలీసులు స్మార్ట్ ఫోన్లలో ఒకరికొకరు మెసేజ్ లు చేసుకోవడం, ఆడుకోవడం, పరస్పరం మాట్లాడుకోవడం వంటివి చేస్తున్నారు. అదే వాళ్ల ప్రధాన డ్యూటీగా మారిపోయింది’ అని ఆర్డర్ లో పేర్కొన్నారు.

పోలీసులు, మహిళలు ఎప్పుడు హై అలర్ట్ గా ఉండాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితులకు రెస్పాండ్ అయ్యేందుకు రెడీగా ఉండాలని పౌరులకు పిలుపునిచ్చారు.

2019 సెప్టెంబరులో రాజస్థాన్ గవర్నమెంట్ ట్రాఫిక్, వీఐపీ డ్యూటీలకు వెళ్లే ముందు మొబైల్ ఫోన్లను సబ్ మిట్ చేయాలని ఆదేశించింది. అవసరం లేకుండా మొబైల్ ఫోన్లు వాడొద్దని కూడా ఆంక్షలు పెట్టింది.