Hyderabad: ఖననం చేసేందుకు స్థలం లేక.. శవంతో జాగారం

మృతి చెందిన వ్యక్తిని ఖననం చేసేందుకు జాగ కరువైంది. మృతదేహాన్ని పూడ్చేందుకు ఆరడుగుల స్థలం దొరకడం లేదు.. హైదరాబాద్ నగరంలోని చాలా శ్మశానవాటికలో ఇదే పరిస్థితి.

Hyderabad: ఖననం చేసేందుకు స్థలం లేక.. శవంతో జాగారం

Hyderabad

Hyderabad: మృతి చెందిన వ్యక్తిని ఖననం చేసేందుకు జాగ కరువైంది. మృతదేహాన్ని పూడ్చేందుకు ఆరడుగుల స్థలం దొరకడం లేదు.. హైదరాబాద్ నగరంలోని చాలా శ్మశానవాటికలో ఇదే పరిస్థితి. పూడ్చేందుకు స్థలం లేక మృతదేహాలతో శ్మశానవాటికల ముందు పడిగాపులు కాస్తున్నారు. నారాయణగూడ శ్మశానవాటికలో ఓ కుటుంబానికి ఎదురైన పరిస్థితి హృదయాన్ని కలిచివేస్తుంది. అయినవారు దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి మృతదేహం పూడ్చేందుకు హైదరాబాద్‌లోని నారాయణగూడ శ్మశానవాటికలో స్థలం దొరకలేదు.

8 ఎకరాల్లో ఉన్న ఈ శ్మశానవాటికలో కొత్తగా పూడ్చేందుకు స్థలం లేకపోవడంతో గతంలో వారి కుటుంబ సభ్యులను పూడ్చిన ప్రదేశంలోనే మళ్లీ గుంత తీసి తమ వారి మృతదేహాలను పూడ్చుతున్నారు. అయితే ఓ మృతదేహాన్ని తీసుకోని వచ్చిన కుటుంబ వారి కుటుంబ సభ్యుల సమాధి కోసం రెండు రోజులు వెతికినా దొరకలేదు. దీంతో కొత్త గుంత తీసేందుకు అనుమతి ఇవ్వాలంటూ శ్మశానవాటిక సిబ్బందిని అభ్యర్థించగా వారు అంగీకరించలేదు. దీంతో రెండు రోజుల తర్వాత తన కుటుంబ సభ్యులను పూడ్చిన స్థలం దొరకడంతో అందులో పూడ్చిపెట్టారు.