Arvind Kejriwal : ఉత్తరాఖండ్ ప్రజలకు ఆప్ అధినేత నాలుగు హామీలు

వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

Arvind Kejriwal : ఉత్తరాఖండ్ ప్రజలకు ఆప్ అధినేత నాలుగు హామీలు

Kejriwal

Arvind Kejriwal వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం డెహ్రాడూన్ లో మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్..ఎలక్ట్రిసిటీకి సంబంధించి నాలుగు హామీలిచ్చారు. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క ఇంటికి నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఇస్తామన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు.పెండింగ్ కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని తెలిపారు. 24 గంటల కరెంట్ సప్లైకి కొంత సమయం పడుతుందని..కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని ఆప్ అధినేత తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఈ రెండు పార్టీలు ఒక ఒప్పందంతో ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుని నాశనం చేశాయని ఆరోపించారు. ఉత్తరాఖండ్ లో అధికార పార్టీకి సీఎం అంటూ ఎవరూ లేరని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. తమ ముఖ్యమంత్రి బ్యాడ్ అని బీజేపీ కార్యకర్తలు,నేతలే చెప్పుకుంటున్నారని అన్నారు.

ప్రతిపక్ష కాంగ్రెస్‌కు కూడా సరైన నాయకుడు లేరని కేజ్రీవాల్‌ విమర్శించారు. నాయకుడ్ని ఎన్నుకునేందుకు ఆ పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్‌ ప్రజల అభివృద్ధి గురించి ఎవరు ఆలోచిస్తారు, అధికారం కోసం పోట్లాడుకునే ఈ పార్టీలు ప్రజల బాగోగుల గురించి పట్టించుకుంటాయా అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌లో దశాబ్దాలుగా చేయలేని ఎన్నో పనులను ఢిల్లీలో కొన్నేళ్లలోనే పూర్తి చేసి చూపించామన్నారు. అందుకే ఉత్తరాఖండ్‌ ప్రజలు ఆప్‌ను ఈ రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించారని అన్నారు.