Sexual Assault : అలా చేయకపోతే లైంగిక దాడికి సమ్మతించినట్లే, మద్రాస్ హైకోర్టు

లైంగిక వేధింపుల కేసు విచారణలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక దాడి సమయంలో మహిళ ప్రతిఘటించకపోతే దాన్ని అంగీకారం లాగే భావించాల్సి ఉంటుందని, అత్యాచారంగా పరిగణించలేమని

Sexual Assault : అలా చేయకపోతే లైంగిక దాడికి సమ్మతించినట్లే, మద్రాస్ హైకోర్టు

Sexual Assault

Sexual Assault : లైంగిక వేధింపుల కేసు విచారణలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక దాడి సమయంలో మహిళ ప్రతిఘటించకపోతే దాన్ని అంగీకారం లాగే భావించాల్సి ఉంటుందని, అత్యాచారంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తెలిపింది. లైంగిక వేధింపుల కేసులో శిక్ష పడిన వ్యక్తిని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. నిందితుడితో ప్రేమలో ఉన్నానని, అతడితో కలిసేదాన్నని ఫిర్యాదు చేసిన మహిళ చెప్పినట్లు జడ్డి తెలిపారు. ఆమె తప్పుడు ఆలోచనతో కోర్టును ఆశ్రయించిందన్నారు.

మధురై జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతీ, యువకులు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుంటానని ఆ యువకుడు హామీ ఇవ్వడంతో సమ్మతితోనే యువతి లైంగిక చర్యల్లో పాల్గొందని ప్రాసిక్యూషన్ వాదించింది.

ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అతడు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో ఆమె అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధురై మహిళా న్యాయస్థానం 2016లో అతడిని దోషిగా నిర్దారించి, పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ అతడు హైకోర్టుని ఆశ్రయించాడు.

విచారణ సందర్భంగా మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఆర్ పొంగియప్పన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రయల్ కోర్టు విచారణ సమయంలో తాను అతడితో ప్రేమలో పడ్డానని, తరుచూ కలిసేవారమని చెప్పింది.. వారి సంబంధం దాదాపు రెండున్నరేళ్లు కొనసాగిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీపై వెనక్కు తగ్గడంతోనే కేసు పెట్టినట్టు గమనించాము.

తన సోదరుడి వివాహం జరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినట్లు పరిస్థితులు వెల్లడించాయి. ఈ వాగ్దానం తర్వాత కూడా ఆ మహిళ అతడితో తన సంబంధాన్ని కొనసాగించింది. ఆమెను వివాహం చేసుకోవడానికి అప్పీలుదారు కచ్చితమైన తేదీ లేదా ఏదైనా సమయం ఇచ్చినట్లు ఆధారాలలో ఎక్కడా లేవు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి త్వరగా చేసుకుందామని పట్టుబట్టడటంతో గర్భస్రావం చేసుకోవాలని అప్పీలుదారుడు సూచించారు.

ఆ ప్రతిపాదనను ఆమోదించని ఆమె తనకు ఇచ్చిన వాగ్దానాన్ని తిరస్కరించాడు కాబట్టి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందువల్ల ఈ మహిళ పూర్తి వాస్తవాలతోనా లేదా విరక్తితో పోలీసులను సంప్రదించిందా? అనే దానిపై తమకు సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తి అన్నారు. అనంతరం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా ప్రకటించారు.