Travancore Devaswom Board: దేవాలయ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న ట్రావెన్‭కోర్

అనేక దేవాలయాల్లో ఆరెస్సెస్ శాఖలు జరుగుతున్నాయి. కవాతులు చేస్తున్నారు. అందుకే మేము ఈ ఆదేశాలను జారీ చేశాము. దేవాలయాలు ఉన్నది భక్తుల కోసం. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకూడదు. బోర్డు వైఖరి ఇదే. మేము ఏ దేవాలయంలోనూ ఎటువంటి దర్యాప్తును నిర్వహించలేదు

Travancore Devaswom Board: దేవాలయ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న ట్రావెన్‭కోర్

RSS: హిందూ సంఘాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి వరుసలో ఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా సరే.. అగ్ర తాంబూలం ఆర్ఎస్ఎస్సే అన్నట్లు ఉంటుంది. అలాంటిది ఆ సంస్థ మీద ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళలోని దేవాలయాల ప్రాంగణాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను అనుమతించరాదని ఆ బోర్డ్ నిర్ణయించింది. ఈ బోర్డు పరిధిలో దాదాపు 1,200 దేవాలయాలు ఉన్నాయి.

Bareilly: 20 కిలోమీటర్లు చేజ్ చేసి, వరుడిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్న యువతి

దేవాయాల ప్రాంగణాల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలను అనుమతించరాదని దేవాలయాల అధికారులకు టీడీబీ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. సామూహిక కవాతులు, ఇతర కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆరెస్సెస్‌ను అనుమతించవద్దని చెప్పింది. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని, ఈ ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Modi Is The Boss: మోదీని బాస్ అంటూ పొగడ్తలు కురిపించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ

ఈ విషయమై టీడీబీ అధ్యక్షుడు కే అనంత గోపన్ మీడియాతో మాట్లాడుతూ ‘‘అనేక దేవాలయాల్లో ఆరెస్సెస్ శాఖలు జరుగుతున్నాయి. కవాతులు చేస్తున్నారు. అందుకే మేము ఈ ఆదేశాలను జారీ చేశాము. దేవాలయాలు ఉన్నది భక్తుల కోసం. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకూడదు. బోర్డు వైఖరి ఇదే. మేము ఏ దేవాలయంలోనూ ఎటువంటి దర్యాప్తును నిర్వహించలేదు. అయితే ఇది పండగల సమయం కావడంతో ఆరెస్సెస్ సహా ఇతరులు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. దానిని మేము వ్యతిరేకిస్తాం’’ అని అన్నారు.