Shocking : అక్టోబర్ 01 నుంచి 16 వరకు మద్యం షాపులు క్లోజ్!

ఈ వార్త చూసి మందుబాబులు షాక్ గురవతున్నారు. ఒకరోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 16 రోజుల పాటు మద్యం షాపులు బంద్ కావడం ఏంటీ ?

10TV Telugu News

No Sale Of Liquor : ఈ వార్త చూసి మందుబాబులు షాక్ గురవతున్నారు. ఒకరోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా 16 రోజుల పాటు మద్యం షాపులు బంద్ కావడం ఏంటీ ? వినాయక చవితి ఉంది. నిమజ్జనం రోజు మద్యం షాపులు బంద్ చేయడం చేస్తుంటారు. కానీ ఇదేంది ? ముందే వెళ్లి తెచ్చుకోవాలా ? అని ఆలోచిస్తున్నారా ? అని ఎవో ఎవో ఊహించేసుకోకండి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాదు. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. అయితే..ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో మాత్రం మద్యం దొరకుతుంది. ప్రైవేటుగా నిర్వహించే మద్యం షాపులు క్లోజ్ చేయాలని ఢిల్లీ సర్కార్ సూచించింది.

Read More : ‘Namokar Mantra’: విద్యుత్ బల్బుపై ‘నమోకర్ మంత్రం’ చెక్కిన 70 ఏళ్ల వృద్ధుడు

ప్రభుత్వాలకు అత్యధికంగా ఆదాయం వచ్చే ఏ శాఖ అంటే ఠక్కున ఎక్సైజ్ శాఖ అని అంటారు. ఎందుకంటే..మందుబాబులు కొనుగోలు చేసిన డబ్బులతో ఖజానా గలగలమంటుంది. ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకరావాలని యోచించింది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఢిల్లీని 32 జోన్లుగా విభజించి లైసెన్స్ ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని డిప్యూటీ స ఎం మనోష్ సిసోడియా వెల్లడించారు. కొత్త పాలసీ కింద నవంబర్ 17 నుంచి ఢిల్లీలో షాపులు తెరబడుతాయని, ఈ సమయంలో అక్టోబర్ 01 నుంచి ప్రైవేటు మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. నూతన పాలసీ ద్వారా రానున్న 12 నెలల్లో రాష్ట్ర ఖజానాకు రూ. 3 వేల కోట్ల అదపపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

Read More : రామానుజ విగ్రహ ప్రతిష్టకు రండి.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు చిన్నజీయర్ ఆహ్వానం..

దుకాణాల వద్ద మరిన్ని సీసీ టీవీ కెమెరాలు చేయడం జరుగుతుందన్నారు.ఢిల్లీలో ప్రస్తుతం 720కి పైగా మద్యం షాపులు ఉన్నట్లు అంచనా. ఇందులో 260 ప్రైవేటు, 460 ప్రభుత్వ మద్యం దుకాణలున్నాయి. మద్యం షాపల లైసెన్స్ లను ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్ 30 తర్వాత లైసెన్స్ లను జారీ చేయలేదు. అక్టోబర్ 01 నుంచి మొత్తం 260 మద్యం దుకాణాలు తెరుచుకోవు. వీటి మూసివేతతో 47 రోజుల పాటు ఢిల్లీలోని ప్రభుత్వ దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయించబడుతుంది.

10TV Telugu News