అమ్మాయిలు జీన్స్, స్కర్ట్స్..అబ్బాయిలు షార్ట్స్ వేసుకోవద్దు, పంచాయతీ ఆదేశాలు

అమ్మాయిలు జీన్స్, స్కర్ట్స్..అబ్బాయిలు షార్ట్స్ వేసుకోవద్దు, పంచాయతీ ఆదేశాలు

UP

Kshatriya Panchayat : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అంతేగాకుండా..నేరాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా..అబ్బాయిలు, అమ్మాయిల డ్రెస్ విషయంలో కొత్త నిబంధన విధించింది ఓ పంచాయతీ. అమ్మాయిలు జీన్స్ ధరించవద్దని క్షత్రియ పంచాయతీ తీర్మానం చేయడం చర్చనీయాంశమైంది. గతంలో ఇతర ప్రాంతాల్లో ఇలాంటి నిబంధనలు అమలు చేసిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు జీన్స్ ధరించినట్లయితే..వారిపై సంఘ బహిష్కరణ చేస్తామని హెచ్చరించడం గమనార్హం.

అమ్మాయిల విషయమే కాదు..అబ్బాయిలు నిక్కర్లు వేసుకోవద్దని, తీర్మానం ఉల్లంఘించిన వారికి ఇదే జరిమాన ఉంటుందని క్షత్రియ పంచాయతీ తేల్చిచెప్పింది. జీన్స్ ధరించడం వల్ల అమ్మాయిలపై వేధింపులు ఎక్కువవుతున్నాయని పంచాయతీ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి చెక్ పెట్టాలంటే..జీన్స్ ధరించకపోవడం ఉత్తమమని కొందరి సూచనల మేరకు మంగళవారం క్షత్రియ పంచాయతీ సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. క్షత్రియ కులం గౌరవ మర్యాదలను పెంపొందించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించాలని, ప్రస్తుతం పంచాయతీ చేసిన తీర్మానం ప్రకారం కట్టుబడి ఉండాలని, ఎక్కవసార్లు పట్టుబడితే మాత్రం సంఘ బహిష్కరణ చేసేందుకు కూడా తాము వెనుకాడమని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ పంచాయతీ చేసిన తీర్మానం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.