Kerala: ‘సర్’, ‘మేడమ్’ అని విద్యార్థులు పిలవద్దు.. టీచర్ అని పిలవాలి: బాలల హక్కుల కమిషన్

పాఠశాలల్లో ఉపాధ్యాయుడిని ‘సర్’ అని, ఉపాధ్యాయురాలిని ‘మేడమ్’ అని విద్యార్థులు పిలుస్తుంటారు. అయితే, కేరళలో ఇకపై అలా పిలవకూడదని ఉపాధ్యాయుడైనా, ఉపాధ్యాయిని అయినా ‘టీచర్’ అని పిలవాలని ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిపరక్షణ కమిషన్ అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. టీచర్ అనే పదం లింగ తటస్థంగా ఉంటుందని పేర్కొంది.

Kerala: ‘సర్’, ‘మేడమ్’ అని విద్యార్థులు పిలవద్దు.. టీచర్ అని పిలవాలి: బాలల హక్కుల కమిషన్

Kerala

Kerala: పాఠశాలల్లో ఉపాధ్యాయుడిని ‘సర్’ అని, ఉపాధ్యాయురాలిని ‘మేడమ్’ అని విద్యార్థులు పిలుస్తుంటారు. అయితే, కేరళలో ఇకపై అలా పిలవకూడదని ఉపాధ్యాయుడైనా, ఉపాధ్యాయిని అయినా ‘టీచర్’ అని పిలవాలని ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిపరక్షణ కమిషన్ అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. టీచర్ అనే పదం లింగ తటస్థంగా ఉంటుందని పేర్కొంది.

ఈ మేరకు, ప్యానెల్ ఛైర్‌పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు సి.విజయ్ కుమార్ తో కూడిన ఆ కమిషన్ బెంచ్ సాధారణ విద్యా శాఖకు సూచనలు చేసింది. ఉపాధ్యాయుడైనా, ఉపాధ్యాయిని అయినా ‘టీచర్’ అని పిలిచేలా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సూచనలు చేయాలని చెప్పింది.

సర్, మేడమ్ అని కాకుండా టీచర్ అని పిలిస్తే అన్ని పాఠశాలల విద్యార్థుల మధ్య సమానత్వం ఉంటుందని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. అలాగే, టీచర్లతో పిల్లలకు ఉండే అనుబంధం మరింత పెరుగుతుందని చెప్పింది. బడుల్లో ఉపాధ్యాయుడిని ‘సర్’ అని, ఉపాధ్యాయురాలిని ‘మేడమ్’ అని వారి లింగం ఆధారంగా విద్యార్థులు పిలుస్తుండడంతో వివక్ష కొనసాగుతుందని ఓ వ్యక్తి వేసిన పిటిషన్ ను పరిశీలించిన కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Union Budget 2023-24: జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు