అరే కాలనీలో మెట్రో కార్ షెడ్ నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

  • Published By: venkaiahnaidu ,Published On : October 21, 2019 / 11:28 AM IST
అరే కాలనీలో మెట్రో కార్ షెడ్ నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

ముంబైలోని     అరే ఫారెస్ట్ ఏరియాలో మెట్రో కార్ షెడ్ నిర్మాణంపై స్టే ఇచ్చేందుకు ఇవాళ(అక్టోబర్-21,2019) సుప్రీంకోర్టు నిరాకరించింది. మెట్రో కార్ షెడ్ నిర్మాణాన్ని కొనసాగించవచ్చునని, అయితే ఇకపై చెట్లను తొలగించరాదని తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. మొక్కలు నాటడం, చట్ల నరికివేతకు సంబంధించిన యథాతథ స్థితిపై నివేదికను, ఫొటోలతో సహా సమర్పించాలని ఆదేశించింది.
 
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బీఎంసీ తరపున వాదనలు వినిపించారు. ఆరే కాలనీలో అదనంగా చెట్లను తొలగించడం లేదని చెప్పారు. సుప్రీంకోర్టు గత తీర్పుకు అనుగుణంగా యథాతథ స్థితిని కొనసాగిస్తున్నామని తెలిపారు. సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి కూడా యథాతథ స్థితి కొనసాగింపుపై హామీ ఇచ్చారు. ఇకపై చెట్లను తొలగించబోమని చెప్పారు. బిల్డింగ్ ప్రాజెక్టులేమీ లేవని, ఇదంతా పూర్తిగా తప్పుడు ఆరోపణలు అని చెప్పారు. ఏకైక ప్రాజెక్టు మెట్రో కార్ షెడ్ మాత్రమేనని చెప్పారు.

ముంబైలో మెట్రో సేవల విస్తరణ కోసమే మెట్రో షెడ్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో మెట్రో సేవల వల్ల సుమారు 7 లక్షల వాహనాలు రహదారులపైకి రాలేదని చెప్పారు. దీనివల్ల వాయు కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ నవంబర్ 5న  సుప్రీంకోర్టు తెలిపింది.