No Stigma In Anaath: ‘అనాథ’ అనడంలో తప్పేం లేదు.. స్పష్టం చేసిన బాంబే హై కోర్టు

తల్లిదండ్రులు లేని పిల్లలను అనాథ అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. ‘అనాథ’ బదులు ‘స్వనాథ’ అని పిలిచేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

No Stigma In Anaath: ‘అనాథ’ అనడంలో తప్పేం లేదు.. స్పష్టం చేసిన బాంబే హై కోర్టు

No Stigma In Anaath: తల్లిదండ్రులు లేని వాళ్లను ‘అనాథ’ అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది బాంబే హై కోర్టు. ‘అనాథ’ అనే పదాన్ని తొలగించి ఇకపై ‘స్వనాథ’ అని పిలవాలని కోరుతూ ‘స్వనాథ్’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

Asteroid: భూమికి దగ్గరగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్.. ఎంత పెద్దదో తెలుసా

బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మాధవ్‌తో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపి, గురువారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం అనాథ అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘అనాథలు ఇప్పటికే సమాజంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనాథ అంటే ఎవరూ లేని వాళ్లు అని అర్థం. అలాగే వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారని, వారికి సాయం అవసరమని, వాళ్లు అన్నీ కోల్పోయారు అన్నట్లు అర్థం వస్తోంది. అందువల్ల అనాథ అనే పదాన్ని తొలగించి ‘స్వనాథ’ అని పిలిచేలా చేయండి.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు.. ప్రభుత్వ నిర్ణయం

‘స్వనాథ’ అంటే ఎవరూ లేరని కాకుండా.. తనకు తాను ఉన్నాడని, తను ఇతరుల మీద కాకుండా తనపైనే ఆధారపడి బతుకుతున్నట్లు అర్థం వస్తుంది. అందువల్ల ‘స్వనాథ’ అని పిలిచేలా చేయండి’’ అని ఆ సంస్థ తమ పిటిషన్‌లో కోరింది. దీనిపై స్పందించిన కోర్టు.. ‘‘సమాజంలో అనాథ అని పిలవడంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ పదాన్ని వాడుతున్నారు. ఈ పదం వల్ల అనాథ పిల్లలు సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్నారు అనడాన్ని అంగీకరించం. ఈ పదాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కోర్టులకు కొన్ని పరిధులు ఉన్నాయి. మా లక్ష్మణ రేఖను దాటం. ఈ విషయంలో జోక్యం చేసుకోం’’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.