Bihar Professor: స్టూడెంట్లు లేరని 33 నెలల జీతం వెనక్కిచ్చిన ప్రొఫెసర్

పాఠాలు చెప్పడానికి స్టూడెంట్స్ ఎవరూ లేనప్పుడు.. శాలరీ ఎందుకని అనుకున్న ప్రొఫెసర్ 33నెలల జీతాన్ని తిరిగిచ్చేశాడు. స్టూడెంట్లకు పాఠాలు వినే ఆసక్తి లేదని తన రూ.23.8లక్షల జీతాన్ని రిటర్న్ చేయబోతుండగా అధికారులు నిరాకరించారు.

Bihar Professor: స్టూడెంట్లు లేరని 33 నెలల జీతం వెనక్కిచ్చిన ప్రొఫెసర్

Protest

Bihar Professor: పాఠాలు చెప్పడానికి స్టూడెంట్స్ ఎవరూ లేనప్పుడు.. శాలరీ ఎందుకని అనుకున్న ప్రొఫెసర్ 33నెలల జీతాన్ని తిరిగిచ్చేశాడు. స్టూడెంట్లకు పాఠాలు వినే ఆసక్తి లేదని తన రూ.23.8లక్షల జీతాన్ని రిటర్న్ చేయబోతుండగా అధికారులు నిరాకరించారు. ముజఫర్‌పూర్‌లోని నితీశ్వర్ కాలేజ్ హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లల్లన్ కుమార్ ఆవేదన ఇది.

యూనివర్సిటీకి చెందిన మరో కాలేజికి షిఫ్ట్ కాకపోతే తాను చదువుకున్నదంతా వృథా అయిపోతుందని భావిస్తున్నాడు.

“నేను కాలేజిలో జాయిన్ అయినప్పుడు పోస్టు గ్రాడ్యుయేట్ క్లాసులు చెప్పేందుకు పోస్టింగ్ ఇవ్వలేదు. నా కంటే తక్కువ ర్యాంకింగ్ తో ఉన్న వారికి ఆ పోస్టింగులు ఇచ్చారు. ఇక్కడ స్టూడెంట్లే ఉండరు. అలా అని కాలేజి మారాలనుకుంటే ట్రాన్స్‌ఫర్ లిస్టులో పేరు లేకుండా చేస్తారు. డిమాండ్ నెరవేరేంత వరకూ కూర్చొని ఉద్యమిస్తా” అని చెప్తున్నాడు లల్లన్ కుమార్.

Read Also: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్

దీనిపై కాలేజి ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. స్టూడెంట్లు క్లాసుల్లో లేరంటూ ఆధారాల్లేకుండా మాట్లాడుతున్నాడు. రెండేళ్లుగా కరోనావైరస్ కారణంగా క్లాసులు సరిగా జరగలేదు. ఒకవేళ లల్లన్ కుమార్ కు ట్రాన్సఫర్ కావాలంటే నేరుగా నన్నే కలసి ఉండాల్సింది” అంటున్నారు.

దీనిపై బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ బీహార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ఆర్కే ఠాకూర్ విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ లల్లన్ కుమార్ తమకు చెక్ ఇచ్చాడని దానిని తాము తీసుకోలేదని పేర్కొన్నారు.

ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు లల్లన్ కుమార్.