High Risk: హైరిస్క్ కేటగిరీలో లేకుంటే కరోనా పరీక్షలు అవసరం లేదు : కేంద్రం

"హైరిస్క్" కేటగిరీలో ఉంటే తప్ప, ప్రత్యేకంగా కోవిడ్ పరీక్షించుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం.

High Risk: హైరిస్క్ కేటగిరీలో లేకుంటే కరోనా పరీక్షలు అవసరం లేదు : కేంద్రం

COVID-19

High Risk: కోవిడ్-19 సోకిన వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తులు వయస్సు కారణంగా లేదా ఇతర వ్యాధులతో బాధపడుతూ “హైరిస్క్” కేటగిరీలో ఉంటే తప్ప, ప్రత్యేకంగా పరీక్షించుకోవల్సిన అవసరం లేదని కీలక సూచన చేసింది కేంద్రం.

కోవిడ్-19 స్క్రీనింగ్‌కు సంబంధించిన వ్యూహానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈమేరకు ప్రకటన చేసింది కేంద్రం.

అంతర్-రాష్ట్ర దేశీయ ప్రయాణాలు చేసే వ్యక్తులు కూడా పరీక్షించుకోవల్సిన అవసరం లేదని వెల్లడించింది కేంద్రం. RT-PCR, TrueNat, CBNAAT, CRISPR, RT-LAMP, ర్యాపిడ్ మాలిక్యులర్ టెస్టింగ్ సిస్టమ్స్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) ద్వారా పరీక్షలను నిర్వహించవచ్చని పేర్కొంది.

పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ (హోమ్ లేదా సెల్ఫ్-టెస్ట్ లేదా RAT), మాలిక్యులర్ టెస్ట్‌లో పాజిటివ్ వస్తేనే ఇన్‌ఫెక్షన్‌ ఎంత ఉందో తెలుసుకునేందుకు స్క్రీనింగ్ చేయించుకోవాలని చెప్పింది కేంద్రం. కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పరీక్షలు అయినా చేసుకోవాలని సూచించింది కేంద్రం.