ఆగేది లేదు : టోల్ గేట్లు ఉండవు.. డబ్బులు కట్ అవుతాయి

హైవేలపై ఎక్కడ చూసిన ఈ టోల్ గేట్లే కనిపిస్తాయి. పండుగలు వచ్చాయంటే చాలు.. భారీగా ట్రాఫిక్ జాంతో ప్రయాణం మరింత కష్టంగా మారుతుంది. ఇకపై మీరు టోల్ ప్లాజాల దగ్గర గంటల కొద్ది ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.

  • Published By: sreehari ,Published On : January 23, 2019 / 12:09 PM IST
ఆగేది లేదు : టోల్ గేట్లు ఉండవు.. డబ్బులు కట్ అవుతాయి

హైవేలపై ఎక్కడ చూసిన ఈ టోల్ గేట్లే కనిపిస్తాయి. పండుగలు వచ్చాయంటే చాలు.. భారీగా ట్రాఫిక్ జాంతో ప్రయాణం మరింత కష్టంగా మారుతుంది. ఇకపై మీరు టోల్ ప్లాజాల దగ్గర గంటల కొద్ది ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.

హైవేలపై వచ్చేపోయే వాహనాలకు ముందుగా దర్శనమిచ్చేవి ‘టోల్ గేట్లు’. ఇప్పుడు హైవేలపై ఎక్కడ చూసిన ఈ టోల్ గేట్లే కనిపిస్తాయి. టోల్ గేట్ పేరు వింటే చాలు.. వాహనదారుల గుండెల్లో గుభేల్ అంటుంది. ఎందుకు అంటారు. టోల్ ఫీ కట్టాలి కదా? టోల్ ఫీ కట్టేస్తాం. ఏంటి పడిగాపులు అని వాహనాదారులు విసుక్కుంటారు. ఇక పండుగలు వచ్చాయంటే చాలు.. హైవే మీదుగా ఊళ్లకు వెళ్లేవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. భారీగా ట్రాఫిక్ జాంతో ప్రయాణం మరింత కష్టంగా మారుతుంది. ఇకపై మీరు టోల్ ప్లాజాల దగ్గర గంటల కొద్ది ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) వాహనదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతుంది.

అది ఏంటంటే.. దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ హైవేలపై త్వరలో టోల్ గేట్లు ఎత్తేస్తారట. మీరు విన్నది నిజమే. నేషనల్ హైవేలపై టోల్ గేట్లు ఎత్తివేసేందుకు ఎన్ హెచ్ఏఐ ప్లాన్ చేస్తోంది. హైవేలపై ప్రయాణం మరింత సులభతరం చేసే దిశగా టోల్ ప్లాజాలు ఎత్తివేయాలని ఎన్ హెచ్ఏఐ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది. 

ఆన్ బోర్డు యూనిట్ డివైజ్..
టోల్ ప్లాజాలకు బదులుగా వాటి స్థానంలో హైవేలపై ఆన్ బోర్డ్ యూనిట్ డివైజ్ లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదేగాని అమల్లోకి వస్తే.. నేషనల్ హైవేలపై వెళ్లే వాహనాదారులకు భారీ ఊరట లభించనట్టే. నివేదిక ప్రకారం.. ఆన్ బోర్డు యూనిట్ డివైజ్ ల అనుసంధానంతో హైవేలపై వాహనాదారులకు ప్రయాణం సులభంగా పూర్తి కానుంది. ఈ డివైజ్ అనుసంధానంతో వాహనాదారుడి అకౌంట్ నుంచి నేరుగా టోల్ ఫీ పేమెంట్ అవుతుంది. ఈ విధానానికి సంబంధించి ఇప్పటికే ఎన్ హెచ్ఏఐ ఢిల్లీ-ముంబై హైవేపై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్టు ఒకసారి విజయవంతమైనట్టు ప్రకటిస్తే చాలు.. నితిన్ గడ్కరీ అధ్యక్షతన రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

ఎలా పనిచేస్తాయంటే..
ఇంతకీ ఆన్ బోర్డ్ యూనిట్ డివైజ్ ఎలా పనిచేస్తాయంటే.. వాహనాల్లో మ్యూజిక్ ప్లేయర్లు ఉంటాయి కదా? వీటికి సమీపంలో ఆన్ బోర్డ్ యూనిట్ డివైజ్ లను అమరుస్తారు. ఈ డివైజ్ లను శాటిలైట్ కు అనుసంధానం చేస్తారు. ఈ విధానం వల్ల వాహనాదారుడు టోల్ గేట్ వద్దకు చేరుకోగానే సదరు వాహనాదారుడి అకౌంట్ నుంచి టోల్ ఫీ నేరుగా కట్ అవుతుంది. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ విధానానికి సంబంధించి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఫాస్ట్ ట్యాగ్ డివైజ్ ల వినియోగంతో ప్రత్యేకించి టోల్ రెవిన్యూ ఎలా పెంచుకోవచ్చు అనేదానిపై నివేదికను ప్రకటించింది. 

నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ డివైజ్ లకు ఎలక్ట్రానిక్ కనెక్షన్లు అనుసంధానం చేస్తారు. ఇందులో పనిచేసే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటీఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీ FASTTAG డివైజ్ వర్క్ అవుతుంది. టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే వాహనాలపై నాన్ స్టాప్ గా పనిచేస్తూనే ఉంటాయి. ప్రీపెయిడ్ అకౌంట్ల నుంచి టోల్ పేమెంట్లు చేసేందుకు వీలుగా లింక్ అయి ఉంటుంది. ఈ విధానంతో హైవేలపై రెగ్యులర్ గా వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం సునాయసంగా మారుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది.