Health Insurance No Use : హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దండగే… 40శాతం ఖర్చులు బాధితుడి నుంచే వసూలు

కరోనా తీవ్రత ఎక్కువైందని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని డబ్బులు కట్టనవసరం లేదని అనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దండగే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కూడా కరోనా చికిత్స ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

Health Insurance No Use : హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దండగే… 40శాతం ఖర్చులు బాధితుడి నుంచే వసూలు

Health Insurance No Use

No Use Of Health Insurance : కరోనా తీవ్రత ఎక్కువైందని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని డబ్బులు కట్టనవసరం లేదని అనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా దండగే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కూడా కరోనా చికిత్స ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకటి కాదు రెండు శాతం కాదు.. ఏకంగా 40శాతం డబ్బులు మన జేబులోంచి తీయాల్సిందే. వివిధ కారణాలతో కార్పొరేట్ ఆసుపత్రులు పేషెంట్ల నుంచే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు పూర్తిగా కవరేజీ ఇవ్వడం లేదు. కరోనా కారణంగా చాలా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దిగజారాయి.

కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయితే జేబులు ఖాళీ అవుతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, అందులో 60శాతం మాత్రమే కవర్ అవుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఆసుపత్రి ఖర్చులో 60శాతం మాత్రమే చెల్లిస్తున్నాయి. మిగిలిన ఖర్చుని పేషెంట్ దగ్గరి నుంచే ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడులో ఏకంగా 45శాతం వరకు బిల్లులు బాధితుడే కడుతున్నాడు. గుజరాత్, కర్నాటకలో 38శాతం వరకు పేషెంట్ జేబు నుంచే ఆసుపత్రికి డబ్బులు వెళ్తున్నాయి.

ఇన్సూరెన్స్ ఉన్నా లక్షల్లో బిల్లులు కట్టాల్సి రావడంతో బాధితులు అప్పులపాలు కావాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ట్రీట్ మెంట్ కోసం మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నా అనేకమందికి క్యాష్ లెస్ చికిత్స అందడం లేదు. చాలా కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను యాక్సెప్ట్ చేయడం లేదు. అడ్వాన్స్ క్యాష్ చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నాయి. డబ్బులు కట్టిన తర్వాత రీయింబర్స్ కోసం అప్లయ్ చేసుకుంటున్నాం అని అంటున్నారు. పోనీ అలా అప్లయ్ చేసుకున్నా.. పీపీఈ కిట్లు, శానిటైజేషన్ చార్జీలు, నెబులైజర్ కిట్లు, స్టీమ్ ఇన్ హేలర్లు, థర్మామీటర్లు ఖర్చు పేరుతో రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. పైగా మొత్తం బిల్లులో ఇన్సూరెన్స్ సంస్థలు 40శాతం కోత విధిస్తున్నాయి. దీంతో ముందస్తుగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నా ఇబ్బందులు తప్పడం లేదు.