No Vaccination, No Salary : వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

No Vaccination, No Salary : వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం

No Vaccination, No Salary

No Vaccination, No Salary దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కరోనా కట్టడికి వ్యాక్సినే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు సూచిస్తున్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇంకా కొంతమంది వెనకాడుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది.

జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని..వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు నెల జీతం పొందలేరని బుధవారం ఫిరోజాబాద్ కి చెందిన ఉన్నతాధికారి తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్..’నో వ్యాక్సిన్ నో శాలరీ’కి సంబంధించి సింగ్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా చీఫ్​ డెవలప్​మెంట్ ఆఫీసర్ చర్చిత్ గౌర్ తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసకుంటుందని,జీతాన్ని నిలిపివేస్తుందని చర్చిత్ గౌర్ తెలిపారు. దీనికి సంబంధించి జిల్లా ట్రెజరీ అధికారులకు,ఆయా విభాగాధిపతులకు మార్గర్శకాలు పంపినట్లు చెప్పారు. టీకా తీసుకోని ఉద్యోగులకు మే నెల జీతం ఆపేయనున్నట్లు ప్రకటించడంతో.. సాలరీ ఆగిపోతుందనే భయంతో ఉద్యోగులు టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు పేర్కొన్నారు.