No Vaccine No Salary: వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతాలివ్వం: కలెక్టర్ ఉత్తర్వులు

కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటునే జీతాలిస్తాం..లేదంటే జీతాలు ఇచ్చేది లేదు అని ఉజ్జయినీ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా దృవీకరణ పత్రాలు అందజేస్తేనే జీతాలు ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

No Vaccine No Salary: వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతాలివ్వం: కలెక్టర్ ఉత్తర్వులు

No Vaccine No Salary

No vaccine No salary ujjain collector Orders : కరోనా వైరస్‌..ప్రపంచం అంతా వినిపించే మాట. ఈ కరోనాకాలంలో వింత వింత పనులే కాదు వింత వింత రూల్స్ కూడా అమలులోకి వస్తున్నాయి. మాస్క్ పెట్టుకోకపోతే నో ఎంట్రీ బోర్డులు చూశాం. అంతేకాదు ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతాలు ఇవ్వం అని కూడా ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఈక్రమంలో ‘కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతాలు ఇస్తాం వేసుకోనివారికి జీతాలు ఇవ్వం’ అంటూ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా​ కలెక్టర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నా..ఇంకా చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపించటంలేదు. ముఖ్యంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనకాడుతున్నారు. ఈక్రమంలో ఉజ్జయిని జిల్లా​ కలెక్టర్ ‘కరోనా వైరస్‌ టీకా వేయించుకున్న ఉద్యోగులకు మాత్రమే జూలై నెల జీతం ఇస్తాం‘ అని ప్రకటించారు.దీంతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడని ఉద్యోగులు నోరెళ్లబెడుతున్నారు. ఉజ్జయిని జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ సింగ్‌ తాజాగా ఓ ప్రకటన విడుదల చేయటంతో..ఇదేం పితలాటకంరా బాబూ..ఇందంతా కరోనా కాలపు మహిమ అనుకుంటున్నారు. జూలై 31 లోపు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే ఆ నెల జీతం రాదని తేల్చి చెప్పారు.

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు దృవీకరణ పత్రాలు అందజేయాలని..అలా అందజేసినవారికి మాత్రమే జీతాలు ఇస్తామని తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్‌ సింగ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 100శాతం వ్యాక్సినేషన్‌ నమోదు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని..దీంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్‌ వివరించారు.