యుద్ధం వద్దు..సర్జికల్ స్ట్రైకే ముద్దు : విశ్వేశతీర్థ స్వామీజీ

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 05:45 AM IST
యుద్ధం వద్దు..సర్జికల్ స్ట్రైకే ముద్దు : విశ్వేశతీర్థ స్వామీజీ

ఉడిపి : పాకిస్థాన్ పై భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఉడిపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ స్పందించారు. ఇరు దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు వస్తున్న వార్తలపై విశ్వేశ్వరతీర్థ మాట్లాడుతు..భారత్-పాక్‌ల మధ్య యుద్ధం ఏమాత్రం మంచిది కాదన్నారు. దీనివల్ల రెండు  దేశాలకు అపారనష్టం తప్పితే ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాక్‌కు సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో బుద్ధి చెప్పడమే సరైన పరిష్కారమన్నారు. పాక్ భూభాగంలోకి దూసుకెళ్లి అక్కడి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడాన్ని తాను సమర్థిస్తున్నానని స్వామీజీ పేర్కొన్నారు.

 

పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్ పై భారత్ సర్జికల్ దాడులతో విరుచుకుపడి వందలమంది ఉగ్రవాదుల్ని మట్టు పెట్టింది. దేశ ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. సర్జికల్ దాడులతో రగిలిపోతున్న పాక్ ఉగ్రవాదులు పదే పదే భారత్ పై దాడులకు పాల్పడుతున్నారు.వారికి భారత్ జవాన్లు కూడా ధీటుగా సమాధానమిస్తున్నారు.  ఈ క్రమంలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలు.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై భారత్ దాడులు చేసిన తర్వాత మరింత దిగజారాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధం సంభవించడం ఖాయమన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో భారత్ ప్రజలు పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాలని కోరుకుంటుంటే..మరోపక్క యుద్ధం వల్ల అపార ఆస్తి..ప్రాణ నష్టాలే తప్ప ఇరుదేశాలకు ఎటువంటి లాభం లేదనే  వాదలను కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో యుద్ధంతో భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాక్‌కు సర్జికల్ స్ట్రయిక్స్ రూపంలో బుద్ధి చెప్పడమే సరైన పరిష్కారమని ఉడిపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ అభిప్రాయపడ్డారు.