Milk Adulteration: దేశంలో పాల కల్తీపై ఆ ప్రచారంలో నిజం లేదు.. కేంద్రం ప్రకటన

దేశంలో పాల కల్తీ ఎక్కువగా జరుగుతోందని.. పాల కల్తీని నియంత్రించకపోతే 2025కల్లా 87 శాతం జనాభా క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల బారిన పడతారని ఇటీవల ఒక ప్రచారం మొదలైంది. ఈ సూచన ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని కేంద్రం ప్రకటించింది.

Milk Adulteration: దేశంలో పాల కల్తీపై ఆ ప్రచారంలో నిజం లేదు.. కేంద్రం ప్రకటన

Milk Adulteration: పాల కల్తీ విషయంలో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఈ ప్రచారంపై కేంద్రం తాజాగా ఒక ప్రకటన చేసింది. దేశంలో పాల కల్తీ ఎక్కువగా జరుగుతోందని.. పాల కల్తీని నియంత్రించకపోతే 2025కల్లా 87 శాతం జనాభా క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల బారిన పడతారని ఇటీవల ఒక ప్రచారం మొదలైంది.

Supreme Court : ‘AP హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోం’..జీవో నెంబర్ 1 కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశం

ఈ సూచన ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని కేంద్రం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాంటి సూచన ఏదీ చేయలేదని వెల్లడించింది. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన పాలు, చేపలు, మాంసం, డైరీ ఉత్పత్తులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది. ‘‘పాలు, పాల ఉత్పత్తుల కల్తీని వెంటనే పరిశీలించకపోతే దేశంలో 87 శాతం జనాభా 2025కల్లా క్యాన్సర్ వంటి రోగాల బారిన పడతారని మీడియాలో ప్రచారం జరిగింది. ఈ అంశం కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ ప్రచారంలో నిజం లేదు’’ అని కేంద్ర జంతు సంరక్షణ, పాడి పరిశ్రమ విభాగం తెలిపింది.

Wrestler protest: రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న బ్రిజ్ భూషణ్.. IOAని ఆశ్రయించిన రెజ్లర్లు

ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయని కేంద్రం అభిప్రాయపడింది. ఇండియాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా తాము పాల కల్తీకి సంబంధించి ఎలాంటి సూచనలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో కూడా దీనిపై ప్రచారం జరుగుతోందని, దీనిలో ఎలాంటి విశ్వసనీయత లేదని కేంద్రం చెప్పింది. దేశంలో నాణ్యమైన పాలు, పాల పదార్థాల లభ్యత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే పాల ఉత్పత్తిని ఘణనీయంగా పెంచింది. 2014-15లో 146.3 మిలియన్ టన్నుల నుంచి 2021-22 నాటికి 221.06 టన్నులకు పాల ఉత్పత్తి పెరిగింది.