Noida Supertech Twin Towers Demolition : నోయిడా సూపర్ టెక్ ట్విన్ టవర్ కూల్చివేతకు ముహూర్తం ఖరారు..

ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలో సూపర్ టెక్ ట్విన్ టవర్ కూల్చివేతకు ముహూర్తం ఖరారు అయ్యింది. గ్రేటర్ నోయిడా సెక్టార్ 91లో 2009 నుంచి ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టింది సూపర్ టెక్ నిర్మణ సంస్థ. అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఆగస్టు 28న ముహూర్తం ఖరారైంది.

Noida Supertech Twin Towers Demolition : నోయిడా సూపర్ టెక్ ట్విన్ టవర్ కూల్చివేతకు ముహూర్తం ఖరారు..

Noida supertech twin towers demolition.

Noida supertech twin towers demolition.. : ఉత్తర్‌ప్రదేశ్‌ నోయిడాలో సూపర్ టెక్ ట్విన్ టవర్ కూల్చివేతకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆగస్టు 28 మధ్యాహ్నాం 2.30 గంటకు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయనున్నారు. గ్రేటర్ నోయిడా సెక్టార్ 91లో 2009 నుంచి ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టింది సూపర్ టెక్ నిర్మణ సంస్థ. అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఆగస్టు 28న ముహూర్తం ఖరారైంది. 3500 కిలోల పేలుడు పదార్థాలతో సెకన్ల వ్యవధిలో ట్విన్ టవర్స్ కుప్ప కులనున్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి హాని కలగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని ఈ కూల్చివేత ప్రక్రియను చేపడుతున్న దక్షిణాఫిక్రా కు చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్‌ సంస్థ వెల్లడించింది.

ట్విన్ టవర్స్ లో ఒకటి అపెక్స్ టవర్ మరొకటి సెయాన్నే టవర్. సెయాన్నే టవర్ లో పేలుడు పదార్థాల అమరిక ప్రక్రియ పూర్తి అయ్యింది. 915 ఫ్లాట్లు,21 షాపులతో ఉన్న ఈ ట్విన్ టవర్స్ నిర్మాణం కూల్చి వేతల కోసం ఆగస్టు 25న పేలుడు ట్రయల్స్ నిర్వహించనుంది ఎడిఫీస్ ఇంజనీరింగ్,జెట్ డేమోల్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా నిర్మాణం జరపడంతో సుప్రీంకోర్టు ఈ కూల్చివేతకు ఆదేశించింది. ఈ రెండు హౌసింగ్ సొసైటీల్లో సుమారు 7 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎమరాల్డ్ కోర్టులో దాదాపు 660 ఫ్లాట్లు, ATS హౌసింగ్ సొసైటీలో 450 ఫ్లాట్లు .. ఉన్నాయి. కూల్చివేత రోజున ఉదయం 7 గంటలకు నివాసాలను ఖాళీ చేయనున్నారు.

నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో పేలుడు జరిగే రోజు మధ్యాహ్నం 2.15 నుండి 2.45 గంటల వరకు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ నిపిపివేయనున్నారు అధికారులు.ఎక్స్‌క్లూజన్ జోన్ లో పేలుడు జరిగే సమయంలో మనుషులు, జంతువులు,వాహనాలకు ఎటువంటి అనుమతి లేదు. దీంట్లో భాగంగా ఎమరాల్డ్ కోర్టు రోడ్డు, ఢిల్లీ వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే సర్వీస్ రోడ్డు, ATS విలేజ్ ముందు ఉన్న రహదారి అధికారులు మూసివేయనున్నారు. కూల్చివేత రోజు ముందు ముందస్తు జాగ్రత్తల కోసం అగ్నిమాపక టెండర్లు..అంబులెన్స్‌లను ట్విన్ టవర్స్ పరిసరాల్లో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు. ఈ కూల్చివేతల గురించి ఎడిఫైస్ ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ..కూల్చివేతల కోసం 8810 రంద్రాల్లో పేలుడు పదార్ధాలు అమర్చింది అని తెలిపారు. పై నుంచి నీరు అమాంతం కిందకు దుమికినట్లు.. ఈ భవనాలు కుప్పకూలుతాయి’ అని వెల్లడించారు. ‘ఈ కూల్చివేత క్రమంలో పక్కన ఉన్న భవన యజమానులతో సదరు సంస్థ చర్చలు జరిపింది.

మేం తీసుకుంటున్న చర్యల పట్ల వారు సంతృప్తిగా ఉన్నారు. కూల్చివేత సమయంలో వెలువడే దుమ్ము, శిథిలాల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నెట్స్‌, పెరిమీటర్ కర్టైన్స్‌ వంటివి ఏర్పాటు చేశాం. పేలుడుతో వచ్చే ప్రకంపనల వల్ల పక్కనున్న భవనాలకు ఎలాంటి హాని కలగకుండా కుషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పేలుడుకు ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. ఆ సమయంలో స్థానికులను ఖాళీ చేయిస్తాం. అలాగే దుమ్ము కూడా మరో ఏడెనిమిది నిమిషాల్లో ఆగిపోతుంది. పేలుడు ప్రారంభం కాగానే ఆ టవర్స్‌ వివిధ దశల్లో అంతస్తుల వారీగా లోపలికి పడిపోతాయి. శిథిలాల తొలగింపుపై చర్చిస్తున్నాం’ అని వెల్లడించారు.

కాగా..నోయిడాలో సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్ టెక్‌ లిమిటెడ్ కంపెనీ 2009లో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణం విషయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. తాజాగా ఈ కూల్చివేత డెడ్‌లైన్‌ను సుప్రీంకోర్టు ఆగస్టు 28కి పొడిగించింది. ఈ నిర్దిష్ట తేదీ నుంచి సెప్టెంబర్‌ 4వరకు కూల్చివేత ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. సాంకేతికత, వాతావరణ పరిస్థితుల కారణంగానే కూల్చివేత తేదీని పొడిగించినట్లు స్పష్టం చేసింది. ఈ పేలుడు కోసం 3,500 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు వాడనున్నారు.