Noida: ఫేక్ కాల్ సెంటర్స్‌కు అడ్డాగా నోయిడా.. వరుసగా బయటపడుతున్న మోసాలు

దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలల్లో ఎక్కువగా ఇక్కడి కాల్ సెంటర్ల నుంచే జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం ఏదో ఒక కాల్ సెంటర్ మోసం బయటపడుతోంది. గడిచిన ఐదేళ్లలో 250కిపైగా కాల్ సెంటర్ మోసాలు బయటపడ్డాయి. కొందరు కేటుగాళ్లు కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతను నియమించుకుంటున్నారు.

Noida: ఫేక్ కాల్ సెంటర్స్‌కు అడ్డాగా నోయిడా.. వరుసగా బయటపడుతున్న మోసాలు

Noida: ఉత్తర ప్రదేశ్‌లో ఐటీ హబ్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న నోయిడా ఇప్పుడు ఫేక్ కాల్ సెంటర్స్‌కు అడ్డాగా మారింది. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలల్లో ఎక్కువగా ఇక్కడి కాల్ సెంటర్ల నుంచే జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం ఏదో ఒక కాల్ సెంటర్ మోసం బయటపడుతోంది. గడిచిన ఐదేళ్లలో 250కిపైగా కాల్ సెంటర్ మోసాలు బయటపడ్డాయి.

ISRO: ఎల్‌వీఎమ్3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలతో దూసుకెళ్లిన రాకెట్

కొందరు కేటుగాళ్లు కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతను నియమించుకుంటున్నారు. వీరికి తక్కువ జీతాలు ఇచ్చి, పని చేయించుకుంటున్నారు. వీరు చేయాల్సింది.. యూజర్లకు రకరకాల కాల్స్ చేసి మోసం చేయడం. ముఖ్యంగా జాబ్స్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే వారిని గుర్తించి, వారిని జాబ్స్ పేరిట మోసగిస్తున్నారు. వారి దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. అలాగే తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తామని, ఇన్సూరెన్స్ పాలసీలు రెన్యువల్ చేస్తామని, లక్కీ డ్రాలు, కౌన్ బనేగా కరోడ్‌పతి వంటి పేర్లతో కూడా మోసం చేస్తున్నారు. అలాగే ఫోన్ ఎక్స్‌చేంజ్‌లు.. అంటే మహిళలు, యువతులతో ఫోన్ కాల్స్ చేయించి, వారిని మోసగించడం, చైల్డ్ పోర్నోగ్రఫీ, మాల్‌వేర్ ఉన్న మెసేజులు పంపడం వంటివి చేస్తున్నారు.

PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో

ఈ కాల్ సెంటర్ల ద్వారా భారతీయులనే కాకుండా.. విదేశీయులను కూడా వీళ్లు మోసం చేస్తున్నారు. ఈ ఫేక్ కాల్ సెంటర్ల మోసం బయటపడ్డప్పుడు కింది స్థాయి సిబ్బంది మాత్రమే చిక్కుతున్నారు. వీటిని నిర్వహించే మాస్టర్ మైండ్స్ చాలా సందర్భాల్లో తప్పించుకుంటున్నారు. కొందరు విదేశీయులు కూడా ఈ ఫేక్ కాల్ సెంటర్స్ నిర్వహిస్తుండటం మరో విశేషం. రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మేవాట్, జంతారా, నుహ్, అల్వార్, మధుర, నోయిడా వంటి కేంద్రాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో వీరిపై కేసు నమోదై, పట్టుబడతారు అని తెలిస్తే వెంటనే మరో రాష్ట్రానికి వెళ్లిపోతున్నారు.

ఈ కేసుల్లో కొంతమంది నిందితులను గుర్తించినప్పటికీ, వాళ్ల ఐడీ ప్రూఫ్స్ ఫేక్ కావడంతో చాలా మంది తప్పించుకుంటున్నారు. ఈ కాల్ సెంటర్ల నుంచి విదేశీయుల్ని కూడా మోసం చేస్తున్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పేరుతో 5,000 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు మోసం చేస్తున్నారు. అందుకే ఇలాంటి వాళ్లు ఉచ్చులో పడకూడదనుకుంటే ఎవరికీ తమ సమాచారాన్ని చేరవేయకూడదని నిపుణలు సూచిస్తున్నారు.