Noida Twin Towers: నోయడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధం.. ట్రాఫిక్ దారి మళ్లింపు

నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కార్యక్రమం ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూల్చివేత సందర్భంగా అధికారులు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ట్విన్ టవర్స్ ఆనుకుని ఉన్న నోయిడా ఎక్స్‪ప్రెస్ వేను కూడా మూసేస్తారు.

Noida Twin Towers: వచ్చే ఆదివారం నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేయబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరగనుంది. దీనికోసం 3,700 కేజీల పేలుడు పదార్థాల్ని వినియోగిస్తన్నారు. వీటికి 20,000 కనెక్షన్లు ఇచ్చారు. 103 మీటర్ల ఎత్తున్న ఈ భవనం తొమ్మిది సెకండ్లలోనే నేలమట్టం కానుంది.

Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం

కూల్చివేత సందర్భంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిర్వాహకులు, అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ట్విన్ టవర్స్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేను ఆనుకుని ఉండటంతో అధికారులు ఈ దారిని ఆదివారం పూర్తిగా మూసేయనున్నారు. ఈ టవర్ వద్దకు చేర్చే ప్రతి దారిని అధికారులు ఉదయం ఏడు గంటలకే మూసేస్తారు. నోయిడా ఎక్స్‌ప్రెస్ వేను మాత్రం మధ్యాహ్నం 2:15కు మూసివేస్తారు. అరగంటపాటు మాత్రమే ఈ రహదారిని మూసే అవకాశాలున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ మేరకు గూగుల్ మ్యాప్స్‌లో కూడా రోడ్స్ అప్‌డేట్ చేస్తున్నారు. విదేశాల్లో ఇలాంటి ఎన్నో బిల్డింగులను కూల్చిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ అనే సంస్థ ఈ కూల్చివేత కార్యక్రమం చేపట్టనుంది.

Bandi Sanjay: బీజేపీ సభకు హైకోర్టు అనుమతి.. ప్రశాంతంగా యాత్ర ముగిస్తామన్న బండి

బిల్డింగులో అమర్చిన పేలుళ్లను వంద మీటర్ల దూరం నుంచి పేలుస్తారు. బిల్డింగ్స్ కూలిన తర్వాత కనీసం 15 నిమిషాలపాటు ధూళి అక్కడి ఆకాశమంతా వ్యాపిస్తుంది. వ్యర్థాలు కూడా భారీ ఎత్తునే పేరుకోబోతున్నాయి. ఈ కూల్చివేతకు మొత్తం రూ.20 కోట్లకు పైగా ఖర్చవుతోంది. ఇప్పటికే బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న వారిని సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించారు. మనుషులతోపాటు, మూగజీవాలు కూడా పరిసరాల్లో లేకుండా చూసుకుంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు