Nokia 5710 XpressAudio: ఫీచర్ ఫోన్‪‌లోనే 4జీ, ఇన్‌బిల్ట్ ఇయర్‌బడ్స్.. సరికొత్త కాన్సెప్ట్‌తో మార్కెట్లోకొచ్చిన నోకియా ఫోన్

కొంత కాలంగా కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయని నోకియా సంస్థ తాజాగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఫీచర్ ఫోన్‪‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 4జీని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులోనే ఇన్‌బిల్ట్ ఇయర్‌బడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌తోనే వాటిని ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Nokia 5710 XpressAudio: ఫీచర్ ఫోన్‪‌లోనే 4జీ, ఇన్‌బిల్ట్ ఇయర్‌బడ్స్.. సరికొత్త కాన్సెప్ట్‌తో మార్కెట్లోకొచ్చిన నోకియా ఫోన్

Nokia 5710 XpressAudio: హెచ్ఎమ్‌డీ సంస్థ సరికొత్త కాన్సెప్ట్‌తో నోకియా ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఫోన్‪‌లోనే ఇన్‌బిల్ట్ ఇయర్‌బడ్స్ ఉండటం ఈ ఫీచర్ ఫోన్ ప్రత్యేకత. అలాగే 4జీ నెట్‌వర్క్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.. వీడియో వైరల్

‘నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ఆడియో’ పేరుతో ఈ ఫోన్ ఇటీవలే గ్లోబల్ మార్కెట్లోకి విడుదలైంది. చూడ్డానికి సాధారణ ఫీచర్ ఫోన్‪‌లాగే కనిపించినప్పటికీ, డిజైన్ చాలా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఫోన్ వెనుక వైపు ఒక జత ఇన్‌బిల్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కూడా ఉన్నాయి. మామూలుగా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌కు ఒక ఛార్జింగ్ కేస్ ఉంటుంది. కానీ ఈ ఇయర్‌బడ్స్‌కు ఛార్జింగ్ కేస్ ఉండదు. ఎందుకంటే ఫోనే ఛార్జింగ్ కేస్‌లా పని చేస్తుంది. అలాగని ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నోకియా ఫోన్‌తో మాత్రమే పని చేస్తాయనుకుంటే పొరపాటే. ఇతర ఏ ఫోన్‌తోనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇదే నోకియా ఫోన్ ద్వారా ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Sachin Tendulkar: మాజీ స్టార్ ప్లేయర్లతో విమానంలో సచిన్.. అభిమానుల్ని ఏం అడిగాడో తెలుసా!

ఈ ఫీచర్ ఫోన్‪‌లో లౌడ్ స్పీకర్, ఇన్‌బిల్ట్ ఎంపీ3 ప్లేయర్, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ కూడా ఉన్నాయి. ఇక మెయిన్ ఫీచర్స్ విషయానికొస్తే… 1,450 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, 31 రోజుల స్టాండ్ బై టైమ్, 2.4 అంగుళాల డిస్‌ప్లే, న్యూమరిక్ అండ్ ఫంక్షనల్ కీస్, 4 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. ఈ నెల 19 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.4,999గా ఉండే అవకాశం ఉంది.