గుట్టలు గుట్టలుగా శవాలు.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్యపై అనుమానాలు

గుట్టలు గుట్టలుగా శవాలు..  భారత్‌లో కరోనా మరణాల సంఖ్యపై అనుమానాలు

Non Stop Cremations Cast Doubt On Indias Counting Of Death Cases

ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా కారణంగా చనిపోతున్నవారి సంఖ్యను ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయా? గుజరాత్‌లోని స్మశాన వాటికల్లో కుప్పలు కుప్పలుగా దహన సంస్కారాలు చేస్తూ ఉంటే.. ప్రతిరోజూ దానికి సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటే.. రోజుకు దేశంలో మాత్రం కేవలం వెయ్యి మంది చనిపోతున్నట్లుగా చూపించడంపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్త అవుతున్నాయి. COVID కారణంగా చనిపోయినట్లు లెక్కించకుండా నాన్-స్టాప్ దహన సంస్కారాలు చేస్తున్నట్లు సందేహిస్తున్నాయి.

గుజరాత్ రాష్ట్రంలో 24గంటలు ఖాళీ లేకుండా స్మశాన వాటికల్లో కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తుండగా.. ఇప్పటికే ఆరోగ్య వ్యవస్థలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేదు.. మందులు తక్కువగా ఉన్నాయి. అనేక ప్రధాన నగరాలు అధికారిక COVID-19 మరణాల సంఖ్య కంటే కరోనావైరస్ ప్రోటోకాల్స్ క్రింద చాలా పెద్ద సంఖ్యలో దహన సంస్కారాలు.. ఖననాలను చేస్తున్నాయి. ఈ విషయాన్ని కార్మికులు కూడా చెబుతున్నారు.

భారతదేశంలో సోమవారం 273,810 కొత్త కరోనా కేసులు రాగా.. 1,619 మరణాలను నమోదు చేసింది. మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 15 మిలియన్లకు పైగా ఉంది, యునైటెడ్ స్టేట్స్ తరువాత ఇది రెండవది. మహమ్మారికి సంబంధించి ప్రభుత్వం దగ్గర విశ్వసనీయ డేటా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది లేకుండా ఆస్పత్రులు ఖాళీల్లేవు.. ఆక్సిజన్ నిల్వ లేదు.. మెడిసిన్ కూడా తక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే, దహన సంస్కారాలు.. చనిపోయిన ప్రతివారికి కరోనా సంభావ్యత 0.1% ఉన్నప్పటికీ కరోనా రూల్స్ ప్రకారం చేస్తున్నామని, అందుకే ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. “చాలా సందర్భాల్లో, రోగులు చాలా క్లిష్టమైన స్థితిలో ఆసుపత్రికి వచ్చి పరీక్షించటానికి ముందే చనిపోతారు. అప్పుడు వారికి పాజిటివ్ ఉందో? లేదో? తెలియదు” అని అధికారి తెలిపారు.

కానీ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో బయోస్టాటిస్టిక్స్ మరియు ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ మాట్లాడుతూ, భారతదేశంలోని చాలా ప్రాంతాలు డేటా కరెక్ట్‌గా ఇవ్వట్లేదని వెల్లడించారు. భారతదేశంలో పావువంతు మరణాలు మాత్రమే వైద్యపరంగా ధృవీకరించబడ్డాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, భారతదేశంలోని 24రాష్ట్రాలలో చాలావరకు నిజమైన COVID మరణాల రేటు తెలియదు అని చెప్పారు.