పెరిగిన వంట గ్యాస్ ధరలు: న్యూఇయర్ షాక్

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 10:05 AM IST
పెరిగిన వంట గ్యాస్ ధరలు: న్యూఇయర్ షాక్

కొత్త సంవత్సరంలో వంట గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులపై భారం పడింది. సబ్సిడియేతర వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్ధలు ప్రకటించాయి. పెరిగిన ధరలు జనవరి 1,2020 నుంచి అమల్లో్కి వచ్చాయి. పెరిగిన ధరల ప్రకారం 14.2 కిలోల సిలిండర్ న్యూఢిల్లీలో రూ.19, ముంబైలో రూ.19.50, ఇతర ప్రాంతాల్లో రూ.20 వరకూ భారం పడుతుంది.

దీంతో వరసగా ఐదవ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు పెరగాయి. ప్రస్తుతం న్యూఢిల్లీలో రూ.714, ముంబైలో రూ.684.50 గా ఎల్పీజీ గ్యాస్ ను సరఫరా చేస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. గత సంవత్సరం డిసెంబర్ లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ను న్యూఢిల్లీలో రూ.695, ముంబైలో రూ.665 చొప్పున కొంటున్నారు.

అంతేకాకుండా డిసెంబర్ 1, 2019 నుంచి 19 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. గత సంవత్సరం ఆగస్టు నుంచి సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.139.5 పెరిగింది. ముంబైలో రూ.138 పెరిగాయి. ఈవిధంగా ఆరు నెల్లలో సబ్సిడియేతర వంట గ్యాస్ సిలిండర్ ధరలు 25 శాతం పెరిగాయి.

ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక్కో కుటుంబానికి 12 సిలిండర్లను సబ్సిడి మీద అందిస్తుంది. పరిమితి దాటితే మార్కెట్ ధరల ప్రకారం గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 12 సిలిండర్ల పై ఇచ్చే సబ్సిడి ప్రతి నెల మారుతుంది.