Rainfall In May : ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం – IMD

భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది...దేశంలోని విస్తారమైన ప్రాంతాలలో వడగాలులు వ్యాపించాయని, అనేక ప్రదేశాల్లో 45 డిగ్రీల మార్కును దాటిందన్నారు...

Rainfall In May : ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం – IMD

Rain

Rainfall : సూర్యుడు భగభగలాడిస్తున్నాడు. ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 122 ఏళ్లలో అత్యంత ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైందని IMD వెల్లడించింది. అయితే.. చల్లటి వార్త కూడా చెప్పింది. మే నెలలో వాయువ్య, ఈశాన్య ప్రాంతాలలో పాటు తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పం మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దేశంలోని విస్తారమైన ప్రాంతాలలో వడగాలులు వ్యాపించాయని, అనేక ప్రదేశాల్లో 45 డిగ్రీల మార్కును దాటిందన్నారు.

Read More : IMD : చల్లటి కబురు.. త్వరలో ఎండల నుంచి ఉపశమనం

గురుగ్రామ్ లో ఆల్ టైమ్ గరిష్టంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ను నమోదు చేసినట్లు, 1979, ఏప్రిల్ 28వ తేదీన 44.8 డిగ్రీల సెల్సియస్ ను బద్ధలు కొట్టిందన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇదే పరిస్థితి నెలకొందన్నారు. 2010, ఏప్రిల్ 18వ తేదీన గరిష్టంగా 43.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నమోదవుతే… ఏప్రిల్ లో 43.5 టెంపరేచర్ రికార్డు అయ్యిందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు తీవ్రమైన వడగాలులు వీచినట్లు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహోలో 45.6 డిగ్రీల సెల్సియస్, నౌగాంగ్ లో 45.6 డిగ్రీల సెల్సియస్, ఖర్గోన్ లో 45.2, మహారాష్ట్రలోని అకోలాలో 45.4, బ్రహ్మపురిలో 45.2, జల్గావ్ లో 45.6, జార్ఖండ్ లో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని డాక్టర్ మృత్యుంజయ్ తెలిపారు.

Read More : IMD Alert : దంచికొడుతున్న వానలు , నాలుగు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..ఐఎండీ అలర్ట్

వాయువ్య, మధ్య భారతదేశం మీదుగా వచ్చే వేడిగాలులు కొనసాగుతాయని, ఇలా ఐదు రోజుల పాటు పరిస్థితి ఉంటుందని IMD తెలిపింది. ఈ పరిస్థితుల్లో శిశువులు, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎండలను రక్షించుకోవడానికి లేత రంగు కాటన్ దుస్తులు, తలపై టోపీ, గొడుగుతో బయటకు రావాలని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా సాధారణం కంటే కనీసం 4.5 ఎక్కువగా ఉన్నప్పుడు హీట్ వేవ్ ప్రకటించబడుతుందని తెలిపింది.