Delhi Earthquake : ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.(Delhi Earthquake)

Delhi Earthquake : దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం భయకంపితం చేసింది. పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూమి కంపించింది.

పంజాబ్, జమ్ము కశ్మీర్ లోనూ భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి. ఫ్యాన్లు ఊగిపోయాయి. వంట వస్తువులు కిందపడ్డాయి.(Delhi Earthquake)

హర్యానా, ఉత్తరప్రదేశ్ లోనూ భూమి కంపించింది. నోయిడా, ఘజియాబాద్, వసుంధర ప్రాంతాల్లో భూప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. అయితే, భారత్ లో ఆస్తి, ప్రాణ నష్టం తప్పడం ఊరటనిచ్చే అంశం. భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో కంగారుపడ్డారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

Also Read..Turkey Earthquake 2023: టర్కీలో భూకంపం వల్ల భారీగా ఆర్థిక నష్టం.. ఎన్నికోట్ల నష్టం జరిగిందంటే ..

భూకంపం.. అనేక దేశాలను వణికించింది. భారత్ సరిహద్దు దేశం అప్ఘానిస్తాన్ లోని ఫైజాబాద్ లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6గా నమోదైంది. అప్ఘానిస్తాన్ ఫైజాబాద్ లో భూకంపం ఎఫెక్ట్ భారత్ పైనా పడింది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

కాగా, ఇటీవల టర్కీలో సంభవించిన భారీ భూకంపం.. ఎంతటి విలయం సృష్టించిందో తెలిసిందే. భూకంపం దెబ్బకు టర్కీ తీవ్రంగా నష్టపోయింది. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.

అప్ఘానిస్తాన్ తో పాటు పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్ లోనూ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ లో భూప్రకపంనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం అప్ఘానిస్తాన్ లో ఉన్నట్లు గుర్తించారు.

Also Read..Turkey Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు

భారత్ లో మంగళవారం రాత్రి 10.20 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. కాసేపు రోడ్ల మీదే ఉండిపోయారు. అసలేం జరిగిందో అర్థం కాక షాక్ లో ఉండిపోయారు. తర్వాత భూకంపం వచ్చిందని తెలుసుకున్నారు. అయితే, మన దేశంలో ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు