North India: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి, పొగ మంచు.. 50 మీటర్ల దూరం కనిపించని దారి

ఉత్తర భారత దేశం చలితో వణికిపోతోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు చలి, పొగ మంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

North India: ఉత్తర భారత దేశాన్ని చలి వణికిస్తోంది. పొగ మంచు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. అనేక చోట్ల పొగ మంచు ప్రభావంతో కనీసం 50 మీటర్ల దూరం వరకు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటున్న ఘటనలో పలువురు మరణిస్తున్నారు.

Covid cases: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్‭ కేసులు.. కేంద్రం తాజా ఆదేశాలు

ఉత్తర ప్రదేశ్, హరియాణాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. మరో 40 మంది వరకు గాయపడ్డారు. ఢిల్లీ పరిధిలో పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దట్టమైన పొగ మంచు వల్ల విజిబిలిటీ 50 మీటర్ల దూరానికి పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా రోడ్డుపైకి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. ట్రాఫిక్ తగ్గిపోయింది. వాహనాలు చాలా నెమ్మదిగా నడుస్తున్నాయి. రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. రైళ్లు గంట నుంచి ఐదు గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, విమాన ప్రయాణాలపై మాత్రం ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణాల్లో పొగ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు తెలియజేస్తున్నాయి.

ఢిల్లీలో సాధారణ ఉష్ణోగ్రతలు 6.3 డిగ్రీలకు, హరియాణాలో 4.5 డిగ్రీలకు, పంజాబ్‌లో 3.4 డిగ్రీలకు పడిపోయాయి. పంజాబ్ రాష్ట్రంలో స్కూళ్లు బుధవారం నుంచి ఉదయం పది గంటలకు ప్రారంభమవుతాయి. జనవరి 21 వరకు ఇదే షెడ్యూల్ ఉంటుంది. జమ్మూ-కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు