PM Modi: 21వ శతాబ్దంలో ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తాయి: మోదీ

ఈ 21వ శతాబ్దంలో భారత దేశ అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలు చోదక శక్తిలా పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

PM Modi: 21వ శతాబ్దంలో ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తాయి: మోదీ

Modi

PM Modi: ఈ 21వ శతాబ్దంలో భారత దేశ అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలు చోదక శక్తిలా పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యాభై ఏళ్ల క్రితం నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (NEFA)గా ఉన్న ఈ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ గా నామకరణం సాధించడంలో ఎన్నో త్యాగాలు ఉన్నాయని గుర్తుచేశారు. సూర్యుడు మొదటగా దేశంలో ఉదయయించే ఈప్రాంతంలో.. 50 సంవత్సరాలుగా దేశభక్తి గల సోదరసొదరీమణులు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని నిరంతరం శక్తివంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు.

Also read: Five States Election 2022 : యూపీలో 11 గంటల వరకు 21.18, పంజాబ్‌‌లో 17.77 శాతం ఓటింగ్

గత ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేసిందని..రానున్న రోజుల్లో ఇక్కడి ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధికే చోదకశక్తిగా పనిచేస్తాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశభక్తిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన అరుణాచల్ ప్రదేశ్ ప్రజల మనస్తత్వం.. సామాజిక సామరస్య భావన, వారి సాంస్కృతిక సంప్రదాయాన్ని, వారసత్వాన్ని కాపాడుకున్న తీరు, పురోగతితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్న తీరు దేశానికి ప్రేరణగా నిలుస్తుందని మోదీ అన్నారు. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన అరుణాచల్ ప్రదేశ్ లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సూచించారు.

Also read: Telangana : హైదరాబాద్ టు ముంబై, సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన వారు వీరే

కాగా అరుణాచల్ ప్రదేశ్ తో పాటు, రాష్ట్ర హోదా సాధించిన మిజోరాం కూడా ఫిబ్రవరి 20న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటుంది. ఈక్రమంలో ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల నుద్దేశించి ప్రసంగించారు. తూర్పు ఆసియా భాగానికి ఈశాన్య రాష్ట్రాలు ముఖద్వారంగా పనిచేస్తున్నాయని, అతి త్వరలో ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుందని మోదీ అన్నారు. తన ప్రసంగం సందర్భంగా.. భారత రత్న భూపేన్ హజారికా రాసిన “అరుణాచల్ హమారా”(అరుణాచల్ మనదే) అనే పద్యాన్ని మోదీ వినిపించారు.

Also read: UP Assembly Polls : వివాదంలో కాన్పూర్ మేయర్.. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ ఫొటోలు..!