అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించం..నిర్మలాసీతారామన్

బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ ఓవైపు దాదాపు 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశ‌వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి స‌మ్మె చేస్తున్నా.. కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాత్రం త‌మ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు.

అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించం..నిర్మలాసీతారామన్

Nirmalasitaraman

Not All Banks బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ ఓవైపు దాదాపు 10లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశ‌వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి స‌మ్మె చేస్తున్నా.. కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాత్రం త‌మ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు. దేశంలోని అన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ప్రైవేటీకరణ జరిగే బ్యాంకుల్లోని ప్రతి ఒక్క ఉద్యోగి ప్రయోజనాలు పరిరక్షించబడతాయని ఆమె తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తాం అని ఆమె అన్నారు.

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీక‌రించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్య‌తిరేకిస్తూ యునైటెడ్ ఫోర‌మ్ ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్ రెండు రోజులుగా దేశవ్యాప్త స‌మ్మె చేస్తున్న నేపథ్యంలో మంగళవారం(మార్చి-16,2021)నిర్మలాసీతారామన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..బ్యాంకులు దేశపు ఆకాంక్షలను తీర్చాలని తాము కోరుకుంటున్నాము అని తెలిపారు.

దేశంలో మౌలికసదుపాయాలు మరియు అభివృద్ధి కార్యకలాపాల కోసం ఓ జాతీయబ్యాంకును ఏర్పాటు చేస్తామని బడ్జెట్ సమయంలోనే తాము ప్రస్తావించామని ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ గుర్తుచేశారు. ప్రైవేటీకరించిన సంస్థలు కూడా ప్రైవేటీకరణ తరువాత పనిచేస్తూనే ఉంటాయని ఆర్థికమంత్రి చెప్పారు. మరోవైపు, ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఐడీబీఐ బ్యాంక్‌లో మెజార్టీ వాటాను అమ్మేయ‌గా.. మ‌రో 14 బ్యాంకుల‌ను విలీనం చేసింది.