అమెజాన్ 7వేల కోట్ల పెట్టుబడిపై గోయల్ కామెంట్స్…ఇండియాకు ఆయనేమీ సాయం చేయట్లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : January 16, 2020 / 04:03 PM IST
అమెజాన్ 7వేల కోట్ల పెట్టుబడిపై గోయల్ కామెంట్స్…ఇండియాకు ఆయనేమీ సాయం చేయట్లేదు

చిన్న,మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు గాను భారత్‌లో 1 బిలియన్‌ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం(జనవరి-15,2020) ఢిల్లీలో నిర్వహించిన సంభవ్‌ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ చెప్పిన విషయం తెలిసిందే. మూడురోజుల భారత పర్యటనకు మంగళవారం ఢిల్లీకి అమెజాన్ అధినేత విచ్చేసిన విషయం తెలిసిందే. 

అయితే జెఫ్ బెజోస్ ప్రకటనపై ఇవాళ(జనవరి-16,2020)ఢిల్లీలో ఓ కర్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ..అమెజాన్ ఏమీ భారత్ కు గొప్ప సాయం చేయడం లేదు. దయచేసి లేఖ మరియు చట్ట స్ఫూర్తిని అనుసరించండని,లొసుగులను కనుగొనడానికి ప్రయత్నించవద్దు నేను  పెట్టుబడిదారులకు చెప్పాను. రెండవది… వారు ఒక బిలియన్ డాలర్లను పెట్టవచ్చు కానీ వారు ప్రతి సంవత్సరం ఒక బిలియన్ డాలర్లను కోల్పోతుంటే, వారు సరదాగా బిలియన్ డాలర్లకు ఫైనాన్స్ చేయవచ్చు. కాబట్టి వారు ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినప్పుడు వారు భారతదేశానికి గొప్ప సహాయం చేస్తున్నట్లు కాదు అని గోయల్ తెలిపారు.

2025 నాటికి 10 బిలియన్‌ డాలర్ల విలువైన మేకిన్‌ ఇండియా ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా ఎగుమతి చేసేలా లక్ష్యాలు నిర్దేశించుకున్నామని బుధవారం జెఫ్ బెజోస్ తెలిపారు. డైనమిజం, శక్తి,వృద్ధి భారత్ లో ఉందన్నారు. భారత్ చాలా ప్రత్యేకమైనదని, భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశమని జెఫ్ బెజోస్ అన్నారు. 21వ శతాబ్దం భారత్,అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాల మధ్య మరింత సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు.అయితే ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యొక్క వ్యాపార పద్ధతులపై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణకు ఆదేశించిన సమయంలో జెఫ్ బెజోస్ భారత పర్యటన చాలా కీలకంగా మారింది.

మరోవైపు 300 సిటీల్లో వేలమంది చిరు వ్యాపారులు జెఫ్ బెజోస్ భారత పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలకు ఫ్లాన్ చేశారు. భారతీయ ఇ-కామర్స్ మార్కెట్… అన్ని అవాంతరాలు, అనారోగ్య, అన్యాయమైన వ్యాపార పద్ధతుల నుండి విముక్తి పొందాలని తాము కోరుకుంటున్నామని, ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకునే వరకు తమ జాతీయ ఆందోళన కొనసాగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.