PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ

దేశానికి సేవ చేయడంలో తాను ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడానికి నిజాయితీగా కృషి చేశానని అన్నారు

PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ

Modi

PM Modi: తన ఎనిమిదేళ్ల పదవీకాలంలో దేశ ప్రజలు సిగ్గుతో తలలు వంచుకునే విధంగా తాను ఎలాంటి పని చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మే 26న ప్రధానిగా ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న మోడీ దేశానికి సేవ చేయడంలో తాను ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడానికి నిజాయితీగా కృషి చేశానని అన్నారు. శనివారం గుజరాత్ లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజ్ కోట్ లో 200 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చేసిందన్నారు.

other stories: Indigo Airlines fined: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.5 లక్షలు జరిమానా విధించిన డీజీసీఏ

‘గత ఎనిమిదేళ్లలో దేశ సేవలో నిమగ్నమైన నేను చేయగలిగిందంతా చేశాను. మిమ్మల్ని గానీ, భారతదేశంలోని ఏ ఒక్క వ్యక్తిని గానీ సిగ్గుతో తల వంచుకునేలా ఏ పనీ నేను చేయలేదు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలుగన్న భారతావనిని నిర్మించేందుకు గత ఎనిమిదేళ్లలో చిత్తశుద్ధితో కృషి చేశాం’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు సాధికారత కలిగిన భారతదేశాన్ని, పరిశుభ్రత, ఆరోగ్యం జీవితంలో భాగంగా ఉన్న భారతదేశాన్ని మహాత్మాగాంధీ కోరుకున్నారని, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ స్వదేశీ (స్థానిక) పరిష్కారాలపై ఆధారపడి ఉందని ప్రధాని అన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తూ మూడు కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించామని, బహిరంగ మలవిసర్జన రహిత కార్యక్రమం కింద 10 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించామని, తొమ్మిది కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు లభించాయని.. 2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు లభించగా, ఆరు కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు లభించాయని, పీఎం-జేఏవై కింద 50 కోట్ల మందికి పైగా ఉచిత చికిత్స పొందేందుకు అవకాశం కల్పించినట్లు మోదీ వివరించారు.

other stories: AAP Rajya Sabha Nominees : ప‌ద్మశ్రీ గ్ర‌హీత‌ల‌కు రాజ్య‌స‌భ టికెట్లు.. ఆప్ సర్కార్ మరో సంచలనం

ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదని, దేశంలోని పేదలకు గౌరవాన్ని అందించాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రజలు నిత్యావసరాలతో కొరతతో ఇబ్బంది పడకుండా..పేదల కోసం దేశంలోని ఆహార ధాన్యాల నిల్వలను తెరిచామని మోదీ చెప్పారు. పేదరికం గురించి మాట్లాడుతూ, పేదల దుస్థితిని తెలుసుకోవడానికి తాను పుస్తకాలు లేదా టెలివిజన్ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే తాను స్వయంగా అలాంటి దశను ఎదుర్కొన్నానని ప్రధాని మోడీ అన్నారు.

other stories: Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్‌నాథ్ కోవింద్

కేంద్రంలో, తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించారు. గుజరాత్ రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని సాధించిందని, 2014 కు ముందు ఈ పరిస్థితి లేదని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారణంగా గుజరాత్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను సాధిస్తోందన్నారు. 2014కు ముందు పరిస్థితులు భిన్నంగా ఉండేవని..మేము ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు ఫైళ్లను కేంద్రానికి (యుపిఎ ప్రభుత్వానికి) పంపితే, వారు తిరస్కరించేవారని, వారు ఏ అభివృద్ధి ప్రాజెక్టును చూడలేకపోయారని ఆయన అన్నారు.