Gujarat: జైలులో ఉన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు: అమిత్ షా

జైలులో ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి నేరస్తుడని కాదు. కొన్ని సార్లు కొన్ని అనుకోని సందర్భాల వల్ల నేరాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అనంతరం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. శిక్ష విధించే విధానం చాలా ముఖ్యం. సరైన రీతిలో శిక్ష ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదు. అసలు శిక్షనే లేకపోతే భయం ఉండదు. భయం లేకపోతే క్రమశిక్షణ ఉండదు

Gujarat: జైలులో ఉన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు: అమిత్ షా

Not every person jailed is criminal by nature says amit shah

Gujarat: స్వభావరిత్యా అందరూ నేరస్తులు కాకపోవచ్చని, అయితే కొన్ని పరిస్థితుల కారణంగా కొందరు నేరాల్లో భాగమవ్వాల్సి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన.. ఆదివారం రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‭లో నిర్వహించిన 6వ ఆల్ ఇండియా జైల్ డ్యూటీ మీట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. సమాజంలో జైల్ల స్వభావాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

‘‘జైలులో ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి నేరస్తుడని కాదు. కొన్ని సార్లు కొన్ని అనుకోని సందర్భాల వల్ల నేరాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అనంతరం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. శిక్ష విధించే విధానం చాలా ముఖ్యం. సరైన రీతిలో శిక్ష ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదు. అసలు శిక్షనే లేకపోతే భయం ఉండదు. భయం లేకపోతే క్రమశిక్షణ ఉండదు. సమాజంలో క్షమశిక్షణ పెరగాలంటే శిక్ష పడుతుందనే భయం ఉండాలి’’ అని అమిత్ షా అన్నారు.

ఉద్దేశపూర్వకంగా నేరాలు చేయని వారిని, సహజ నేరస్తులు కాని వారిని, పుట్టుకతో నేరస్తులు కాని వారిని, నేరాలే అలవాటుగా కాని నేరస్తులు కాని వారిని గుర్తించి వారిని తిరిగి పౌర సమాజంలోకి పంపాల్సిన బాధ్యత జైలు పరిపాలనా విభాగానిదేనని అమిత్ షా అన్నారు. జైల్ డ్యూటీ మీట్ సందర్భంగా ఖైదీలకు క్రీడాపోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 1,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

Minister Rajnath Singh: రేపటి నుంచి జపాన్, మంగోలియా దేశాల్లో పర్యటనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్