చిదంబరం బెయిల్‌కు సుప్రీం నో

చిదంబరం బెయిల్‌కు సుప్రీం నో

సుప్రీం కోర్టు మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం బెయిల్‌కు నో చెప్పింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అతనికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి సంకెళ్లు తప్పేలా లేవు. కస్టడీ గడువును సుప్రీం సెప్టెంబర్ 5వరకు పొడగించినా గురువారం సంచలన ప్రకటన చేసింది. దీంతో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించడమే తరువాయి. 

కపిల్ సిబల్ చేస్తున్న బెయిల్ పోరాటం సక్సెస్ కాలేకపోయింది. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల తరలింపుకు సహకరించారనే ఆరోపణలతో చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు. ఆగష్టు 21నుంచి  మొదలైన ఆయన కేసు సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది. 

నేర నిరూపణకు తగినంత స్వేచ్ఛ ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. కేసు పూర్తిగా పరిశీలించి పరిస్థితులను బట్టి చిదంబరానికి బెయిల్ ఇవ్వకూడదని కోర్టు ప్రకటించింది. 15రోజుల పాటు సీబీఐ కస్టడీలో గడుపుతున్న చిదంబరానికి ఇది మింగుడుపడని వార్త. రెండ్రోజుల కస్టడీ తర్వాత నుంచి చిదంబరం తరపు న్యాయవాది బెయిల్ కోసం పోరాడుతూనే ఉన్నారు.