Brij Bhushan: ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇక్కడ లేను.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్

బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్‌లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, రవి దహియా, దీపక్ పునియాలు ఐఎంఏ అధ్యక్షురాలు పీటీ ఉషను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు

Brij Bhushan: ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇక్కడ లేను.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్

WFI

Brij Bhushan: తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ రాజీనామా డిమాండ్లను పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌.. తాను ప్రస్తుతం ఉన్న పదవిలో (రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు) ఎవరి దయాదాక్షిణ్యాలతో లేనని అన్నారు. తనను ప్రజలు ఎన్నుకున్నారని, ఆ ఎన్నిక ఆధారంగా ఈ స్థాయికి వచ్చినట్లు శుక్రవారం పేర్కొన్నారు. తన మీద పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని, దానిని తొందరలోనే బయట పెడతానని బ్రిజ్ భూషణ్ ప్రకటించారు.

Cong to PM: 16 కోట్ల ఉద్యోగాలపై మోదీని నిలదీసిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

బ్రిజ్ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాల్సిందేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా దాదాపు 30 మంది రెజ్లర్లు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిరసనకు దిగారు. శుక్రవారం వరుసగా మూడో రోజు తమ నిరసనను కొనసాగించారు. పలువురు వీరికి సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటిస్తున్నారు. రెజ్లర్ల ఆరోపణలను కేంద్ర క్రీడాశాఖ సీరియస్ గా తీసుకోవటంతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గురువారమే రాజీనామా చేస్తారని భావించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Texas: టెక్సాస్‭లోని ఏకైక హిందూ దేవాలయంపై దాడి చేసిన దొంగలు, హుండీ చోరి

మహిళా రెజర్లపై వేధింపులకు పాల్పడినట్లు తనపై వస్తున్న ఆరోపణలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడనని, నేను ఎన్నుకోబడిన వ్యక్తిని, ఎవరి దయతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిలో లేనని శరణ్ సింగ్ స్పష్టం చేశారు. నేను దేశం విడిచిపోవచ్చని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అమిత్ షాను కలిశారా అని మీడియా ప్రశ్నించగా.. కేంద్ర హోమంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ లో ఎవరిని నేను కలవలేదని, ఎవరితోనూ మాట్లాడలేదని అన్నారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ తెలిపారు. అయితే, సాయంత్రం 4 లేదా 5గంటల సమయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటుచేసి అన్ని విషయాలను వెల్లడిస్తానని అన్నారు.

Secunderabad Fire Accident : ఆ ముగ్గురు ఎక్కడ..? సికింద్రాబాద్ అగ్నిప్రమాద బిల్డింగ్‌లో డ్రోన్లతో గాలింపు

బ్రిజ్ భూషణ్ పై ఆందోళనను రెజ్లర్లు మరింత ఉధృతం చేస్తున్నారు. శుక్రవారం భారత ఒలింపిక్ సంఘాన్ని (IOA)ని వారు ఆశ్రయించారు. రెజ్లర్లకు స్పాన్సర్ షిప్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, కోచ్‌లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, రవి దహియా, దీపక్ పునియాలు ఐఎంఏ అధ్యక్షురాలు పీటీ ఉషను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Swati Maliwal: స్వాతి మాలివాల్‌ను కారుతో లాక్కెళ్లిన వీడియో విడుదల.. స్వాతిపై బీజేపీ విమర్శలు