Uddhav Thackeray :నేనేమీ నవాజ్ షరీఫ్ ని కలవలేదు..మోడీతో భేటీపై ఉద్దవ్

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ఇవాళ ఢిల్లీలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీని క‌లిశారు.

Uddhav Thackeray :నేనేమీ నవాజ్ షరీఫ్ ని కలవలేదు..మోడీతో భేటీపై ఉద్దవ్

Not Like I Met Nawaz Sharif Uddhav Thackeray After Face Time With Pm

Uddhav Thackeray మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ఇవాళ ఢిల్లీలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీని క‌లిశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవర్ సహా పలువురితో కలిసి ప్రధానిని కలిశారు ఉద్దవ్. ప్రధానిని 10 నిమిషాలపాటు ఉద్దవ్ ప్రతేకంగా కలిసినట్లు సమాచారం.

ప్రధానితో భేటీ తర్వాత ఉద్దవ్ మీడియాతో మాట్లాడుతూ…మరాఠా రిజర్వేషన్, తౌక్టే తుఫాన్ సహాయం, మెట్రో కారు షెడ్‌, జీఎస్టీ ప‌న్ను వ‌సూళ్ల ప‌రిహరం సహా పలు అంశాలను ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. మ‌రాఠా భాష‌కు ప్రాచీన హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో ఉంద‌ని సీఎం చెప్పారు. ఈ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని ప్ర‌ధాని హామీ ఇచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ప్రధానితో కొద్దిసేపు ప్రతేకంగా సమావేశమవ్వడంపై ఉద్దవ్ మాట్లాడతూ.. రాజ‌కీయంగా తాము ఒక‌టి కాక‌పోయినా..తమ మ‌ధ్య బంధం బ్రేక‌వ్వ‌లేద‌న్నారు. తానేమి న‌వాజ్ ష‌రీఫ్‌ను క‌లిసేందుకు వెళ్ల‌లేద‌ని, తాను ప్ర‌ధానిని వ్య‌క్తిగ‌తంగా క‌లిసిస్తే త‌ప్పేమీ లేద‌ని అన్నారు. గ‌తంలో ప్ర‌ధాని మోడీ ఓ సారి అక‌స్మాత్తుగా పాక్ మాజీ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్‌ను క‌లిశారు. ఆ సంఘ‌ట‌నను గుర్తుచేస్తూ ఉద్ద‌వ్ ఈ విధంగా సెటైర్లు వేశారు. ఇక, వ్యాక్సిన్ సేకరణను కేంద్రీకృతం చేసిన ప్ర‌ధానికి థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు ఉద్దవ్ తెలిపారు. త్వ‌ర‌లోనే ఇండియాలో ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సినేట్ అవుతార‌ని ఉద్ద‌వ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.