Maharashtra: వీఐపీ సెక్యూరిటీకి నిర్భయ నిధులు.. అబ్బబ్బే, ఇది ఉద్ధవ్ సర్కార్ పనే అంటున్న ఫడ్నవీస్

మీడియాలో ఈ వార్తను నేను ఒకరోజు గమనించాను. వీఐపీ భద్రత నుండి ఆ వాహనాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని నేను ఆరోజే ఆదేశించాను. అయితే ఇది మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది నేను రికార్డులో ఉంచాను. ఇప్పుడు నేను చెప్పేది తప్పనిపిస్తే మీరు నాపై ప్రివిలేజ్ మోషన్ కూడా తీసుకురావచ్చు

Maharashtra: వీఐపీ సెక్యూరిటీకి నిర్భయ నిధులు.. అబ్బబ్బే, ఇది ఉద్ధవ్ సర్కార్ పనే అంటున్న ఫడ్నవీస్

Not our decision, MVA gave Nirbhaya fund vehicles for VIP security says Fadnavis

Maharashtra: నిర్భయ చట్టం కింద రిజర్వు చేసిన నిధులను వీఐపీ భద్రతలోని వాహనాల కోసం ఖర్చు పెట్టింది గతంలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వమేనని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణితి షిండే అడిగిన ప్రశ్నకు గురువారం ఆయన మాట్లాడుతూ ఈ సమాధానం ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన ఏక్‭నాథ్ షిండే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదని, గతంలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మే 2022లో ఆ నిధుల్ని దారి మళ్లించిందని, వీఐపీ భద్రతలోని వాహనాలకు వాటిని ఖర్చు చేసిందని ఆయన అన్నారు.

Karnataka: బెళగావికి చేరిన లింగాయత్‭ల ఆందోళన.. బీజేపీతో ఢీ అంటే ఢీ

“మీడియాలో ఈ వార్తను నేను ఒకరోజు గమనించాను. వీఐపీ భద్రత నుండి ఆ వాహనాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని నేను ఆరోజే ఆదేశించాను. అయితే ఇది మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది నేను రికార్డులో ఉంచాను. ఇప్పుడు నేను చెప్పేది తప్పనిపిస్తే మీరు నాపై ప్రివిలేజ్ మోషన్ కూడా తీసుకురావచ్చు” అని ఫడ్నవిస్ అన్నారు. గత నెలలో ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో ముంబై పోలీసులు 220 బొలెరోలు, 35 ఎర్టిగాలు, 313 పల్సర్ బైక్‌లు, 200 యాక్టివాలను కొనుగోలు చేయడానికి నిర్భయ ఫండ్ కింద ఉన్న రూ. 30 కోట్లకు పైగా ఖర్చు చేశారని రిపోర్ట్ చేశారు.

Rajya Sabha: బుధవారం అవమానం, గురువారం వెనక్కి.. బిహార్‭పై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్

మహారాష్ట్రలో అధికార సంకీర్ణంలో భాగమైన ఏకనాథ్ షిండే నేతృత్వంలోని బాలాసాహెబంచి శివసేన వర్గానికి చెందిన మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలకు ‘వై ప్లస్ విత్ ఎస్కార్ట్’ భద్రత కల్పించడం కోసం జూలైలో 47 బొలెరోలను అత్యవసరంగా కొనుగోలు చేశారని సదరు వార్తలో పేర్కొన్నారు.