Gehana Vasisth : పోర్న్ కాదు, శృంగార చిత్రాలే.. రాజ్‌ కుంద్రాకు నటి మద్దతు

పోర్న్ చిత్రాలు తీస్తున్న కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. కాగా, ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు రాజ్ కుంద్రాను తప్పుపడుతుంటే, మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు.

Gehana Vasisth : పోర్న్ కాదు, శృంగార చిత్రాలే.. రాజ్‌ కుంద్రాకు నటి మద్దతు

Gehana Vasisth

Gehana Vasisth : పోర్న్ చిత్రాలు తీస్తున్న కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. కాగా, ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు రాజ్ కుంద్రాను తప్పుపడుతుంటే, మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. రాజ్ కుంద్రా తీసింది శృంగార చిత్రాలే తప్ప పోర్న్ కాదని శిల్పా శెట్టి వాదిస్తోంది. తాజాగా మరో నటి రాజ్ కుంద్రాకు మద్దతుగా నిలిచింది. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన గెహనా వశిష్ట్ మరోసారి తెరపైకి వచ్చింది.

శిల్పాశెట్టి వాదనలకు గెహనా వశిష్ట్ మద్దతు పలికింది. అవి పోర్న్ చిత్రాలు కాదని గెహనా స్పష్టం చేసింది. ఆ యాప్ లో ఉన్నవి శృంగార భరిత చిత్రాలు మాత్రమేనంది. “శిల్పా చెప్పింది నిజమే. హాట్ షాట్స్ యాప్ లో ఎప్పుడూ పోర్న్ కంటెంట్ లేదు. లేని దాన్ని ఉందంటూ మరొకరికి ఎలా అంటగడతారు?” అని గెహనా ప్రశ్నించింది. అంతేకాదు రాజ్ కుంద్రా గురించి షర్లీన్ చోప్రా, పూనమ్ పాండే చెప్పిన దాంట్లో నిజం లేదని, వారిద్దరూ అబద్దాలు చెబుతున్నారని అంది.

గెహనా కూడా అశ్లీల వీడియోల వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటోంది. అశ్లీల చిత్రాలు రూపొందించి, వాటిని పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేస్తోందన్న ఆరోపణలపై ఆమెను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ ఏడాది ఆరంభంలో అదుపులోకి తీసుకున్నారు. గెహనా తెలుగులో ‘అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి’, ‘ప్రేమించు పెళ్లాడు’, ‘బీ టెక్ లవ్ స్టోరీ’, ‘నమస్తే’, ‘ఆపరేషన్ దుర్యోధన’, ‘ఆపరేషన్ దుర్యోధన-2′ చిత్రాల్లో కనిపించింది.

రాజ్ కుంద్రా హాట్ షాట్ యాప్ కు సంబంధించి తనకు సంబంధం ఉందన్న విషయాన్ని నటి శిల్పాశెట్టి ఖండించినట్లు పోలీసుల సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో తన భర్త రాజ్ కుంద్రాకు నటి శిల్పాశెట్టి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఎరోటికా పోర్న్ కంటే భిన్నమైనదని, తన భర్త ఎలాంటి పోర్నోగ్రఫీ కంటెంట్ తయారీలో పాల్గొనలేదని శిల్పా అంది. అంతేకాదు ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్ ల నుండి ‘మరింత అశ్లీలమైన’ ఉదాహరణలను చూపిందట. కుంద్రా యాప్ హాట్‌షాట్‌లో లభించే సినిమాలు ‘అశ్లీలత కాదని దర్యాప్తు బృందానికి తన ప్రకటనను రికార్డ్ చేస్తున్నప్పుడు శిల్పా చెప్పినట్టు తెలుస్తోంది. ఒక పక్క పోలీసులు రాజ్ కుంద్రా మోడల్స్ ను బెదిరించి పోర్న్ వీడియోలు తీసి, హాట్ షాట్ యాప్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్లారని, అందుకు తగిన ఆధారాలు తమ దగ్గరున్నాయని చెబుతుండగా, తన భర్త ఎలాంటి అశ్లీల కంటెంట్ ని ప్రొడ్యూస్ చేయలేదని, ఎరోటికాకు, పోర్న్ కు వ్యత్యాసం ఉంటుందని శిల్పా శెట్టి చెప్పినట్లుగా సమాచారం. పోర్నోగ్రఫీ కేసు ఫిబ్రవరిలోనే నమోదు కాగా, తాజాగా ఈ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఈ కేసు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.