Mamata Banerjee : మోడీకి దీదీ లేఖ..చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేసేది లేదు

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి త‌న నిర‌స‌న గ‌ళం వినిపించారు.

Mamata Banerjee : మోడీకి దీదీ లేఖ..చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేసేది లేదు

Mamata Banerjee

Mamata Banerjee బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి త‌న నిర‌స‌న గ‌ళం వినిపించారు. బెంగాల్ చీఫ్ సెక్రటరీ అలపన్ బందోపాధ్యాయ బదిలీ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోమవారం మమత లేఖ రాశారు. ప్రస్తుతమున్న క్లిష్ల పరిస్థితుల్లో త‌మ రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీని కేంద్రానికి పంపించేది లేదంటూ ఆమె మోడీకి రాసిన లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి రిపోర్టు చేయాలని కేంద్రం పంపిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మమత కోరారు. బంద్యోపాధ్యాయ్ రాష్ట్రంలోనే కొన‌సాగుతార‌ని, ఇక్క‌డి కొవిడ్ సంక్షోభ నిర్వ‌హ‌ణ‌ను చూసుకుంటార‌ని మ‌మ‌త ఆ లేఖలో దీదీ తేల్చి చెప్పారు.

బందోపాధ్యాయను కేంద్రం వద్ద రిపోర్ట్ చేయమని వెలువడిన ఏకపక్ష ఉత్తర్వు చూసి తాను ఆశ్చర్య పోయానని ప్రధానికి రాసిన లేఖలో దీదీ పేర్కొన్నారు. బెంగాల్ ప్ర‌భుత్వం ఇలాంటి తీవ్ర ప‌రిస్థితుల్లో త‌న చీఫ్ సెక్ర‌ట‌రీని రిలీజ్ చేయ‌దు. గ‌తంలో బందోపాధ్యాయ ప‌ద‌వీకాలాన్ని పొడిగిస్తూ ఇచ్చిన చ‌ట్ట‌ప‌ర‌మైన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయ‌ని తాము భావిస్తున్న‌ట్లు ఆ లేఖ‌లో మ‌మ‌త స్ప‌ష్టం చేశారు. బంద్యోపాధ్యాయ్ రాష్ట్రంలోనే కొన‌సాగుతార‌ని, ఇక్క‌డి కొవిడ్ సంక్షోభ నిర్వ‌హ‌ణ‌ను చూసుకుంటార‌ని కూడా మ‌మ‌త అందులో తేల్చి చెప్పారు.

అసలేంటీ సీఎస్ వివాదం

పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్​ బంధోపాధ్యాయ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం,మమత సర్కార్​ మధ్య వివాదం కొనసాగుతోంది. గత శుక్రవారం బెంగాల్ లో యాస్ తుపాను వల్ల కలిగిన నష్టంపై చర్చించేందుకు ప్రధాని మోడీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం మమతా బెనర్జీ 30 నిమిషాలు ఆలస్యంగా రావడం,ఆ తర్వాత 15మాత్రమే సమావేశంలో పాల్గొని వెళ్లిపోవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన నేపథ్యంలో బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలపన్ బందోపాధ్యాయని కేంద్రం రీకాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31 న ఉదయం 10 గంటలకు అయన ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయం లో గల పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కానీ మ‌మ‌త మాత్రం ఆయ‌న‌ను రిలీజ్ చేసేది లేద‌ని తేల్చి చెబుతూ మోడీకి లేఖ రాయడం గమ‌నార్హం.

వాస్తవానికి బంధోపాధ్యాయ్ మే-31 రిటైర్డ్ అవ్వాల్సి ఉంది. అయితే కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం ఆరు నెలల పాటు పెంచాలని కోరుతూ ఈ నెల 10న సీఎం మమతాబెనర్జీ.. ప్రధానికి లేఖ రాశారు. మమత విజ్ణప్తిని కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు బంధోపాధ్యాయ్ పదవీకాలాన్ని మూడు నెలలు(ఆగస్టు-30 వరకు) పొడిగిస్తూ కేంద్రం ఈ నెల 24న ఆదేశాలిచ్చింది. ఇది జరిగి మూడు రోజులు కాకముందే ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. సీఎస్‌ బంధోపాధ్యాయ్‌ సేవలను ఉపయోగించుకోదలచినట్టు సమాచారం పంపించింది. తక్షణమే ఆయనను రిలీవ్‌ చేయాలని శనివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.