ప్రముఖ జర్నలిస్ట్ రవి బెలగెరే కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2020 / 03:51 PM IST
ప్రముఖ జర్నలిస్ట్ రవి బెలగెరే కన్నుమూత

Noted journalist Ravi Belagere dead కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్‌, రచయిత రవి బెలగెరే (62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున బెలగెరేను గుండెపోటుతో హాస్పిటల్ కి తరలించగా… అప్పటికే ఆయన మృతిచెందినట్లు హాస్పిటల్ వర్గాలు ధ్రువీకరించాయి.



బెలగెరే మృతి పట్ల కర్ణాటక సీఎం యడ్యూరప్ప సంతాపం తెలియజేశారు. రవిగెరే కుటుంబానికి, ఆయన అభిమానులకు ఈ సమయంలో ఆయన లేరన్న బాధను తట్టుకునే దైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ యడియూరప్ప ట్వీట్‌ చేశారు.



మార్చి 15, 1958న బళ్లారిలో జన్మించిన రవి బెలగెరే జర్నలిస్ట్‌గా, రచయితగా మంచి గుర్తింపు పొందాడు. కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర, పురావస్తు శాస్త్రంలో ఎంఏ చేశారు. కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యోత్సవ అవార్డు, కర్ణాటక మీడియా అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. బెలగెరే తన ప్రసిద్ధ కన్నడ టాబ్లాయిడ్‌ ‘హాయ్‌ బెంగళూరు’ నుంచి కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన కల్పన, అనువాదం, కాలమ్‌, జీవిత చరిత్రలు సహా 70పైకి సాహిత్య రచనలు చేశారు. అతను నేర ప్రపంచంపై రాసిన ప్రసిద్ద కాలమ్‌ పాపిగళ లోకదల్లి బాగా ప్రాచుర్యం పొందింది.