Nift : నిఫ్ట్ లో యూజీ,పీజీ,పీహెచ్ డీ కోర్సుల భర్తీ నోటిఫికేషన్

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసుతో సంబంధం లేదు. రాత పరీక్ష, జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌

Nift : నిఫ్ట్ లో యూజీ,పీజీ,పీహెచ్ డీ కోర్సుల భర్తీ నోటిఫికేషన్

Nift

Nift : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)2022 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంగణాల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కోర్సుల వివరాలకు సంబంధించి ;

బ్యాచిలర్‌ ప్రోగ్రాములు(బి.డిజైన్‌): యాక్ససరీస్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ ప్రోగ్రాములు. వీటికి ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 2022 ఆగస్టు 01 నాటికి 24 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ లో అర్హత సాధించిన అభ్యర్థులను సిట్యుయేషన్‌ టెస్ట్‌కి ఎంపిక చేస్తారు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(బీఎఫ్‌టెక్‌): అప్పారెల్‌ ప్రొడక్షన్‌ ప్రోగ్రామ్. దీనికి ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసుతో సంబంధం లేదు. రాత పరీక్ష, జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

డాక్టోరల్‌ ప్రోగ్రాములకు సంబంధించి సంభందిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో విధానంలో పంపాల్సి ఉంటుంది. యూజీ/పీజీ ప్రోగ్రాములకు – 2022, జనవరి మొదటి వారం చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://nift.ac.in/సంప్రదించగలరు.