కిరాణ కొట్టులో ఉప్పు, పప్పుతో పాటు విస్కీ కూడా కొనుక్కోండి

మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరింత తాగండి, ఊగండి అని ప్రభుత్వం అంటోంది. తాగుబోతులకు ఇబ్బందులు కలగకుండా

  • Published By: veegamteam ,Published On : February 3, 2020 / 05:22 AM IST
కిరాణ కొట్టులో ఉప్పు, పప్పుతో పాటు విస్కీ కూడా కొనుక్కోండి

మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరింత తాగండి, ఊగండి అని ప్రభుత్వం అంటోంది. తాగుబోతులకు ఇబ్బందులు కలగకుండా

మీరు విన్నది నిజమే. రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరింత తాగండి, ఊగండి అని ప్రభుత్వం అంటోంది. తాగుబోతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. మందు కోసం ఎక్కువగా కష్టపడకుండా, శ్రమించకుండా.. అందుబాటులో మద్యం ఉంచడానికి రంగం సిద్ధం చేసింది. మందు కావాలంటే మద్యం షాపుకి వెళ్లాల్సిందే. ఇకపై ఆ ఇబ్బంది లేదు. చెమట పట్టకుండానే చుక్క దొరుకుతుంది.
ఇప్పటివరకు కిరాణ కొట్టులో ఉప్పు, పప్పు, సబ్బులు, టూత్ పేస్ట్ వంటివి కొన్నారు. ఇకపై అదే కిరాణ కొట్టులో.. ఎంచక్కా మందు బాటిళ్లు కూడా కొనొచ్చు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. అయితే ఈ గొప్ప అవకాశం మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. పంజాబ్(punjab) రాష్ట్రంలో.

కిరాణ కొట్టులో ఫారిన్ లిక్కర్:
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ(liquor policy) తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఫారిన్(foreign liquor) లేదా ఇంపోర్టడ్ లిక్కర్(imported liquor) కిరాణ(kirana stores) షాపుల్లోనూ అమ్ముతారు. మద్యం తయారీ కంపెనీలు.. స్థానికంగా ఉన్న కిరాణ షాపుల యజమానులతో ఒప్పందం చేసుకుంటారు. ఆ తర్వాత షాపుల్లోనూ లిక్కర్ బాటిల్స్(liquor bottles) అమ్ముతారు. ఇందుకోసం ప్రభుత్వం L2B లైసెన్స్ ఇవ్వనుంది. గతంలో డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో(departmental stores) మాత్రమే ఫారిన్ లిక్కర్ అమ్మకాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇకపై కిరణా షాపుల్లోనూ అమ్మకాలు జరుపుతారు.

మద్యం అమ్మకాలకు నిబంధనలివే:
ఈ కొత్త లిక్కర్ పాలసీ 2020 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వస్తుంది. దీనికి పలు షరతులు ఉన్నాయి. షాపుకి కొలతలున్నాయి. 400 స్వ్కేర్ ఫీట్ లో షాపు ఉండాలి. గ్రోసరీ(grocery), ఫ్రోజన్ గూడ్స్(frozen goods), షుగర్(sugar), బేకరీ(bakery items), టాయ్ లెటరీస్(toiletries), కాస్ మెటిక్స్(cosmetics), హౌస్ హోల్డ్ గూడ్స్(household goods), టాయ్స్(toys), స్పోర్ట్స్ గూడ్స్(sports goods), ఎలక్ట్రానిక్స్, అపెరల్స్(apparesl), ఆఫీస్ స్టేషనరీ, గిఫ్ట్ ఐటెమ్స్ లేదా హౌస్ హోల్డ్ గూడ్స్ విక్రయించే షాపు అయి ఉండాలి. లైసెన్స్ ఫీజుని రూ.20లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో లైసెన్స్ ఫీజు రూ.10లక్షలుగా ఉండేది.

తాగినోళ్లకి తాగినంత:
పంజాబ్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళలు మండిపడుతున్నారు. మద్యపానం కారణంగా ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయిని తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. మద్యపానం నిషేధానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఇంకా ప్రోత్సహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ్య సమజానికి ఏం మేసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా.. మందుబాబుబు మాత్రం ఖుషీగా ఉన్నారు. కిరాణ కొట్టులో మందు కొంటే దాని కిక్కే వేరప్పా అంటున్నారు.