LIC policies: మీకు LIC పాలసీ ఉందా? వెంటనే పాన్ కార్డ్‌తో లింక్ చేసుకోండి..!

మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీ ఉందా? ఉంటే, మీరు వెంటనే మీ పాలసీని PAN కార్డ్‌తో లింక్ చేయాలని కోరుతుంది ఎల్ఐసీ.

LIC policies: మీకు LIC పాలసీ ఉందా? వెంటనే పాన్ కార్డ్‌తో లింక్ చేసుకోండి..!

Pan Card

LIC policies: మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీ ఉందా? ఉంటే, మీరు వెంటనే మీ పాలసీని PAN కార్డ్‌తో లింక్ చేయాలని కోరుతుంది ఎల్ఐసీ. మీరు ఇంట్లో నుంచే ఇప్పుడు చాలా సులభంగా LICని మీ పాన్ కార్డుకు లింక్ చేసుకోవచ్చు. ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు తమ పాన్ నెంబర్లను పాలసీకి ఆన్‌లైన్‌లోనే.. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవచ్చు.

మీ పాన్ నెంబర్‌ని ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయాలంటే, ముందుగా పాలసీ నెంబర్, పాన్ నెంబర్ వివరాలను సిద్ధం చేసుకుని పాలసీకి లింక్ ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి. ఈ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేస్తే పాలసీ క్లెయిమ్ చేసే సమస్యలు రావు అని చెబుతున్నారు. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://linkpan.licindia.in/UIDSeedingWebApp/కి వెళ్లాలి
పేజీలో అవసరమైన అన్ని సమాచారాన్ని పూరించాలి.
పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడి, పాన్ కార్డ్, మీ పేరు, ఫోన్ నంబర్ నమోదు చేయాలి.
దీని తరువాత, మీరు మీ LIC పాలసీ సంఖ్యను ఎంటర్ చెయ్యాలి. పాన్ కార్డ్ లింక్ చేయబడుతుంది.
ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ని పూరిస్తే, మొబైల్ నంబర్‌పై OTP వస్తుంది.
OTP ఎంటర్ చేసిన తర్వాత.. మీరు లింక్ PAN విత్ పాలసీ పేజ్‌లోకి వస్తారు.
ఇందులో పాన్ రిజిస్ట్రేషన్ కోసం రిక్వెస్ట్ అందుకున్నట్లు మెసేజ్ వస్తుంది. ప్రాసెస్ పూర్తయినట్లే!

PAN-LIC లింక్:
స్థితిని ఎలా తనిఖీ చేయాలి- మీరు ఈ అధికారిక లింక్‌పై క్లిక్ చేయాలి https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus?_ga స్థితిని తనిఖీ చేయడానికి. ఇక్కడ మీరు మీ పాలసీ నంబర్, పుట్టిన తేదీ మరియు పాన్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ని పూరించండి మరియు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత మీ LIC పాలసీ మరియు PAN లింక్ యొక్క స్థితి కనిపిస్తుంది.