Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన ఓ 29ఏళ్ల యువకుడిలో బీఏ.5 వేరియంట్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అధిక సాంక్రమిక సామర్థ్యం ఉన్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 రకాల కేసులను ఇప్పటికే తమిళనాడు, తెలంగాణలో గుర్తించగా...తాజాగా బీఏ.5 రెండో కేసు గుజరాత్‌లో వెలుగు చూసింది.

Omicron BA.5 : కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తూనేవుంది. డేల్టా, డేల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి కొత్త కొత్త వేరియట్స్ రూపంలో మానవాళిపై దాడి చేస్తూ ప్రాణాలు హరిస్తోంది. దక్షిణాఫ్రికాతోపాటు పలు దేశాల్లో కరోనా కేసులు ఉధృతి కావడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కారణమయ్యాయి. దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ.. వైరస్ ఇంకా ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్లతో కల్లోలం సృష్టిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన బీఏ.5 రకం మరో కేసు నమోదైంది. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ యువకుడిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన ఓ 29ఏళ్ల యువకుడిలో బీఏ.5 వేరియంట్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అధిక సాంక్రమిక సామర్థ్యం ఉన్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 రకాల కేసులను ఇప్పటికే తమిళనాడు, తెలంగాణలో గుర్తించగా…తాజాగా బీఏ.5 రెండో కేసు గుజరాత్‌లో వెలుగు చూసింది. దక్షిణాఫ్రికాలో నివాసముంటున్న యువకుడు ఇటీవల వడోదరలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఈనెల 1న అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్ బీఏ.5 పాజిటివ్‌గా తేలింది.
Omicron : ఎలుకల నుంచి మనుషులకు ఒమిక్రాన్ వ్యాప్తి?
ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం స్పష్టం చేసింది. తెలంగాణ, తమిళనాడులో ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4ను గుర్తించారు. ఇండియన్ సార్స్ కోవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.
BA.4 మొదటి కేసును గుర్తించాక, దక్షిణాఫ్రికా నుండి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తితో పరిచయం ఉన్న వారి కాంటాక్ట్ ట్రేసింగ్ ను ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు. ఏ లక్షణాలు లేకపోయినా అతని నుంచి మే 9న సేకరించిన శాంపుల్స్‌లో విషయం బయటపడిందని న్యూస్ మీడియా పేర్కొంది. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మే 23న ఇదే కేసుపై బులెటిన్‌ను విడుదల చేసింది.
తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతిలో ఒమిక్రాన్ బీఏ.4ను గుర్తించామని ఇన్సాకాగ్ పేర్కొంది. ఆ బాధితురాలికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆమె వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొన్నట్లు తెలిపింది. తెలంగాణలో 80 ఏళ్ల వృద్ధుడిలో బీఏ.5 బయటపడినట్లు స్పష్టం చేసింది. అతడిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయని, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లు పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువురు బాధితుల కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను చేపట్టినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.
- Arvind Kejriwal: గుజరాత్‌లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్
- Gujarat : వాడి పారేసిన ప్లాస్టిక్ ఇవ్వండీ..ఈ కేఫ్ లో నచ్చింది తినండీ తాగండీ..ఎక్కడో కాదు మన భారత్ లోనే
- PM Modi Mother 100th Birthday : తల్లి 100వ పుట్టిన రోజు..పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ
- Dholera airport: ధొలేరా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర
- Pink Lake: గుజరాత్‌లో పింక్ లేక్.. అద్భుతం అంటున్న స్థానికులు
1Bhagwant Mann : పంజాబ్ సీఎం కు కాబోయే భార్య ఎవరో తెలుసా ?
2Google: అంకుర సంస్థలు ప్రారంభించాలనుకుంటోన్న వారికి గూగుల్ గుడ్‌న్యూస్
3Udaipur Killing: ఉదయ్‌పూర్ హత్యపై 16ఏళ్ల బాలిక ఫేస్బుక్ పోస్ట్.. చంపేస్తామంటూ బెదిరింపులు
4Kali Poster: కాళీ పోస్టర్ తర్వాత కన్యాకుమారిలో శివుడు సిగరెట్ అంటించుకుంటున్న పోస్టర్
5MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
6Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
7Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
8Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
9Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
10London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!