Chitra Ramkrishna : ఎస్ఎస్ఈ సీఈవో చిత్రా అరెస్టు..

నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను కో-లొకేషన్‌ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్‌ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి...

Chitra Ramkrishna : ఎస్ఎస్ఈ సీఈవో చిత్రా అరెస్టు..

Chitra Ramakrishna

NSE Co-Location Scandal : నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను కో-లొకేషన్‌ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. 2022, మార్చి 06వ తేదీ రాత్రి ఢిల్లీలో ఆమెను అరెస్ట్‌ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. మార్చి 07వ తేదీ సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. N.S.E కో-లోకేషన్‌ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. చిత్రా రామకృష్ణన్‌ సీఈవోగా ఉన్నకాలంలో NSEలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఆమె ఓ హిమాలయ యోగి ఆదేశాల మేరకు పనిచేశారని, కీలక సమాచారాన్ని లీక్‌ చేశారని, అనర్హులకు పదవులిచ్చారని పలు ఆరోపణలు ఉన్నాయి.

Read More : Chitra Ramakrishna : ఎన్ఎస్ఈ మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ ఇంటిపై ఐటీ దాడులు

మెయిల్‌ రూపంలోనే చిత్రకు, అజ్ఞాత బాబాకు మధ్య సంభాషణలు జరిగాయని.. ఆయన చెప్పిన ప్రాజెక్టులపైనే చిత్రా రామకృష్ణ సంతకాలు చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. దీంతో ఆమెపై 2018 మేలో కేసు నమోదైంది. వరుసగా మూడు రోజుల పాటు చిత్రా రామకృష్ణను విచారించిన సీబీఐ, అదే సమయంలో ఆమె ఇంటిలో సోదాలు జరిపింది. విచారణలో సరిగ్గా సమాధానం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. చిత్రాను విచారించడానికి కేంద్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ సీనియర్‌ సైకాలజిస్ట్‌ సేవలను సైతం వినియోగించింది. ఆమె సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని సైకాలజిస్ట్‌ నిర్ధారించిన తర్వాత, అరెస్ట్‌ చేయక తప్పలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. చిత్ర ముందస్తు బెయిల్‌ కోసం చేసుకొన్న దరఖాస్తును సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసిన తర్వాతే రోజే ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

Read More : Chitra Ramakrishna : చిత్రా రామకృష్ణ విచారణలో కీలక విషయాలు వెల్లడి

అజ్ఞాత యోగి ఎవరనే విషయంపై మార్కెట్ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అజ్ఞాత యోగి బయట వ్యక్తే అంటున్నారు సెబీ అధికారులు. NSEలో పనిచేసే వ్యక్తే అజ్ఞాత యోగి అంటూ మరో వాదన బలంగా వినిపిస్తోంది. అటు ఆనంద్ సుబ్రమణియన్ అజ్ఞాత యోగి పేరుతో చిత్రను ట్రాప్ చేశారంటున్నారు. ఇక తనకు సలహాలు ఇచ్చిన వ్యక్తి ఆనంద్ సుబ్రమణియన్ కాదని చిత్రా రామకృష్ణ తేల్చిచెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో..తెరపైకి కొత్తగా చెన్నైకి చెందిన ఓ స్వామి పేరు బయటకు వచ్చింది. సెంథిల్ స్వామియే అజ్ఞాత యోగి అంటున్నారు. దీంతో దర్యాప్తు సంస్థల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చిత్ర రామకృష్ణను కూడా అతి త్వరలో అరెస్టు చేయనున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో..చిత్రను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.