NSG officer: ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్‌జీ ఆఫీసర్

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కొవిడ్ తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) హాస్పిటల్ లో..

NSG officer: ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్‌జీ ఆఫీసర్

Nsg Officer

NSG officer: నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కొవిడ్ తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) హాస్పిటల్ లో బుధవారం చేరిన ఆయనకు వెంటిలేటర్ ను సకాలంలో ఏర్పాటు చేయలేకపోవడంతో తుది శ్వాస విడిచారు.

గ్రూప్ కమాండర్ (కో ఆర్డినేషన్) బీ కే ఝా బుధవారం కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. అతనికి కొవిడ్ పాజిటివ్ రావడంతో గ్రేటర్ నోయిడాలోని సీఏపీఎఫ్ హాస్పిటల్ లో చేర్పించారు. అతని వయస్సు 53ఏళ్ల వరకూ ఉండొచ్చు.

కొద్ది రోజుల క్రితం ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవుతున్నాడని రికవరీ అవుతాడని భావించింది సీఏపీఎఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. స్టార్టింగ్ లో ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైంది. ఆ తర్వాత బీఐపీఏపీతో నడిపిస్తున్నారు. వెంటిలేటర్ వరకూ వెళ్లలేదని తెలియజేశారు. ఉన్నట్టుండి మంగళవారం రాత్రి పరిస్థితి పూర్తిగా విషమించింది. డాక్టర్లు అదుపుచేయలేకపోయారు. వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కోసం పంపించారు. షిఫ్ట్ చేసే లోపే ప్రాణాలు కోల్పోయాడు ఆఫీసర్.

సీఏపీఎఫ్ హాస్పిటల్ లో ఐసీయూ వెంటిలేటర్స్ సమస్యలు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటిలేటర్ బెడ్ దొరకలేదు. కార్డియాక్ అంబులెన్స్ ఏర్పాటు చేసి తరలించే లోపే ఆయన చనిపోయారు. ఎన్ఎస్జీలో ఇది తొలి కరోనా మరణం.

1993 బ్యాచ్ ఆఫీసర్.. బీఎస్ఎఫ్ క్యాడర్ లో పని చేస్తున్నారు ఝా. 2018లో డెప్యూటేషన్ మీద ఎన్ఎస్జీలో జాయిన్ అయ్యారు. గతంలో బీఎస్ఎఫ్ డైరక్టర్ జనరల్ కు ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ గా, కమాండెంట్ గా పనిచేశారు.