Amit Shah Missing : అమిత్ షా కనబడట్లేదంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు..మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటూ నెటిజన్లు సెటైర్లు

కరోనా విజృంభణతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర హోం మంత్రి ఎక్కడ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Amit Shah Missing : అమిత్ షా కనబడట్లేదంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు..మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటూ నెటిజన్లు సెటైర్లు

Amit Shah Missing

Amiit Shah కరోనా విజృంభణతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర హోం మంత్రి ఎక్కడున్నాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గురువారం ఉదయం 5వేలకు పైగా ట్వీట్లతో హ్యష్‌ట్యాగ్‌ ‘అమిత్‌షా మిస్సింగ్’ ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచింది. దేశం కరోనాపై పోరాటం చేస్తుంటే హోం మంత్రి..మిస్సింగ్ ఇన్ యాక్షన్ (MI) అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఏకంగా ఆయన కనిపించడం లేదంటూ పోలీసులకే ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి కనిపించడం లేదంటూ బుధవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఎన్ఎస్‌యూఐ సెక్రెటరీ నగేశ్ కరియప్ప ఫిర్యాదు చేశారు. కరోనా కోరల్లో దేశం చిక్కుకుని, ప్రజలు సంక్షోభం ఎదుర్కొంటున్న ఇలాంటి తరుణంలో అమిత్‌షా కనిపించకుండా పోయారని కరియప్ప తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు దేశానికి సేవ చేయాలే కానీ, సంక్షోభ పరిస్థితుల్లో పలాయనం చిత్తగించకూడదని అన్నారు. రా

రాజకీయనేతలు జవాబుదారీగా ఉండాలని, కేవలం భారత ప్రభుత్వానికి, బీజేపీకి మాత్రమే కాకుండా దేశ ప్రజల పట్ల తప్పనిసరిగా ఉండితీరాలని ఫిర్యాదులో తెలిపారు. చివరిసారిగా అమిత్‌షా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కనిపించారని తన ఫిర్యాదులో కరియప్ప పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు..NSUI ఆఫీసుకు వెళ్లి విచారణ చేశారు. బెంగాల్ ఎన్నికల ప్రచారం ముగిసి, ఫలితాలు వెల్లడయిన తర్వాత అమిత్ షా ఇంత వరకూ మీడియా ముందుకు రాని విషయం తెలిసిందే.